Advertisementt

శ్రీవిష్ణు కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు

Sat 07th Dec 2019 10:02 AM
sree vishnu,hasith goli,people media factory,abhishek agarwal art llp,film launched  శ్రీవిష్ణు కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు
Sree Vishnu, Hasith Goli, People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched శ్రీవిష్ణు కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు
Advertisement
Ads by CJ

శ్రీవిష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు  నేడు సంస్థ కార్యాలయంలో జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్.

వినోదంతో కూడిన డ్రామా ఈ చిత్ర కధలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి.

శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగిన వారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం వివేకసాగర్, ఛాయాగ్రహణం వేదరామన్. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

Sree Vishnu, Hasith Goli, People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched:

Sree Vishnu New Film Launch details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ