Advertisementt

అనసూయ కాదు.. బాలయ్య మూవీలో రష్మి!!

Mon 09th Dec 2019 12:26 AM
rashmi,replaces,anasuya,role,balakrishna,nbk 106 movie  అనసూయ కాదు.. బాలయ్య మూవీలో రష్మి!!
Rashmi in Balayya and Boyapati Film అనసూయ కాదు.. బాలయ్య మూవీలో రష్మి!!
Advertisement
Ads by CJ

జబర్దస్త్ షోతో యాంకర్ అనసూయకి ఏ రేంజ్ ఫాలోయింగ్ అయితే వచ్చిందో.. అనసూయ ప్లేస్ కి అనుకోకుండా వచ్చిన యాంకర్ కమ్ యాక్ట్రెస్ రష్మీ గౌతమ్ కి అంతే పేరొచ్చింది. రష్మీ స్టేజ్ మీద హాట్ హాట్ డ్రెస్సులతో.. వచ్చిరాని తెలుగుతో అందరిని నవ్వించడం ఒక ఎత్తైతే.. సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం అంటూ వచ్చే గాసిప్స్ తో రష్మీ చాలా హైలెట్ అయ్యింది. మధ్యలో హీరోయిన్ గా అందాలు ఆరబోసే హాటెస్ట్ భామగా రష్మీ క్లిక్ అవ్వలేకపోయినా.... జబర్దస్త్ యాంకర్ గా ఈటీవీలో మాత్రం దున్నేస్తుంది. అనసూయ చలవతో జబర్దస్త్ తో రష్మీ బుల్లితెర మీద మెరిసిపోతుంది. అయితే తాజాగా రష్మీకి అదిరిపోయే వెండితెర ఆఫర్ ఒకటి వచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్.

అది కూడా బోయపాటి - బాలకృష్ణ కాంబోలో రీసెంట్ గా మొదలైన NBK106 లో రష్మీకి ఓ ఛాన్స్ దక్కినట్లుగా వినికిడి. అది కూడా ఏ గ్లామర్ పాత్రో కాదు.. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని ప్రచారం జరుగుతుంది. మరి వల్గర్ గా వచ్చిన గ్లామర్ పాత్ర అయితే ఆలోచించాలి కానీ.. ఇలాంటి కీలక పాత్ర అంటే రష్మీ కళ్ళకద్దుకుని ఓకే చెప్పడం ఖాయమంటున్నారు. అయితే ఈ కీ రోల్ కి ముందు హాట్ యాంకర్ అనసూయని అడిగారట బోయపాటి. కానీ బోయపాటి ఛాన్స్ ని అనసూయ సున్నితంగా తిరస్కరించడంతో.. ఆ ఛాన్స్ రష్మీకి దక్కినట్లుగా చెబుతున్నారు. 

Rashmi in Balayya and Boyapati Film:

Rashmi Replaces Anasuya Role in NBK 106

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ