Advertisementt

‘ఎంత మంచివాడ‌వురా’ తొలి లిరిక‌ల్ సాంగ్ విడుదల

Mon 09th Dec 2019 02:48 PM
entha manchivaadavuraa,first lyrical video,kalyan ram,sathish vegesna,song release  ‘ఎంత మంచివాడ‌వురా’ తొలి లిరిక‌ల్ సాంగ్ విడుదల
Entha Manchivaadavuraa Emo Emo Lyrical Video Released ‘ఎంత మంచివాడ‌వురా’ తొలి లిరిక‌ల్ సాంగ్ విడుదల
Advertisement
Ads by CJ

‘ఎంత మంచివాడ‌వురా’ తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘ఏమో ఏమో ఏ గుండెల్లో...’ విడుద‌ల‌

‘‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం

ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..’’

అని అంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘ఎంత మంచివాడ‌వురా’. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘ఏమో ఏమో ఏ గుండెల్లో..’ను చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌ల చేసింది. గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాలసుబ్ర‌మ‌ణ్యం ఈ పాట‌ల‌ను ఆల‌పించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ ట్యూన్‌కి ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియజేసే చిత్రమిది. అలాంటి కంటెంట్‌ను సూచించేలాగానే ఈ రోజు విడుద‌లైన సాంగ్ ‘ఏమో ఏమో ఏ గుండెల్లో..’ ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఎస్‌.పి. బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు ఎక్స‌లెంట్‌గా పాడిన ఈ పాటకు రామ‌జోగయ్య‌గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌: ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా

సమర్పణ : శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Click Here for Song

Entha Manchivaadavuraa Emo Emo Lyrical Video Released:

Entha Manchivaadavuraa Promotion Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ