నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి అప్పుడే రెండు వారాలు దాటిపోయింది. రోజా జడ్జ్‌గా జబర్దస్త్ జబర్దస్త్‌గా సాగుతుంది. నాగబాబు జబర్దస్త్‌ని వీడినప్పటికీ... ఆయన వీర విధేయులకు అసలు భాదే లేనట్లు కనబడుతుంది. ఎప్పుడూ నాగబాబు భజన చేసే ఆది, సుడిగాలి సుధీర్ లాంటోళ్ళయితే ఇప్పుడు జబర్దస్త్‌లో బెస్ట్ స్కిట్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు. నాగబాబు ఊసే లేదు. నాగబాబు పాటికి నాగబాబు జబర్దస్త్ కహానీని ముగించేశాడు. నాలుగైదు వీడియోస్‌లో జబర్దస్త్ హిస్టరీ విప్పిన నాగబాబు ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. అయితే నాగబాబు కూడా.. వెళతారనుకున్న కమెడియన్స్ జబర్దస్త్ ని వీడేందుకు సుముఖంగా లేరు. అగ్రిమెంట్ కారణమా? జబర్దస్త్‌ని వీడితే కెరీర్ హుష్ కాకి అనుకున్నారో ఏమో గాని నాగబాబుతో నడవడానికి సిద్దమైన వారు కూడా వెనక్కి తగ్గారు.
చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలాంటోళ్ళు ఒక వారం గ్యాప్‌తో మళ్లీ జబర్దస్త్ చూరు కింద చేరారు. అయితే తాజాగా నాగబాబు కూడా జబర్దస్త్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, జబర్దస్త్‌కి నాగబాబు గుడ్ బై చెప్పినా జబర్దస్త్ టిఆర్పీకి ఢోకా లేదని, అయితే నాగబాబు వెళ్లిన జీ ఛానల్‌లో లోకల్ గ్యాంగ్స్‌కి ఎన్నెన్నో అనుకుంటాం ప్రోగ్రామ్స్ కి అంత టీఆర్పీ రేటింగ్ రాలేదనే న్యూస్ నడుస్తుంది. మరోపక్క తనతో కలిసి నడుస్తారనుకున్న ఆది, సుధీర్, చంద్ర, ఆర్పీలు తనకి ఇలా హ్యాండ్ ఇచ్చారేమిటో అనుకుంటూ నాగబాబు మదనపడుతున్నాడని అంటున్నారు.
పనిలో పనిగా నాగబాబు కూడా జబర్దస్త్ కి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అసలు నాగబాబు వెళ్ళిపోతే మల్లెమాల జబర్దస్త్‌ని మూసుకోవాల్సి వస్తుందనే న్యూస్ నుండి నాగబాబే తిరిగి జబర్దస్త్‌కి వచ్చినా రావొచ్చనే న్యూస్ రావడం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే న్యూసే అనే చెప్పాలి.