టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన దగ్గుబాటి రానా బ్రదర్.. అభిరామ్ గుర్తున్నాడా..? గుర్తుకు రావట్లేదా..? అదేనండి.. వివాదాస్పద నటి శ్రీరెడ్డితో సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అని అప్పట్లో ఫొటోలు హల్ చల్ చేసిన వ్యవహారంతో అయినా గుర్తు పట్టారా..? ఇప్పుడు కాస్త గుర్తొచ్చేఉంటాడులెండి. ఈయనగారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడట. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘అసురన్’ రీమేక్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయ్. వెంకీ చిన్నకుమారుడిగా అభిరామ్ నటిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు సినిమాను పట్టాలెక్కించడానికి చకచకా సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో.. అభిరామ్ వచ్చేస్తున్నాడహో అని సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిమానులు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా ‘వెంకీమామ’ సినిమా విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన అభిరామ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. అసురన్ రీమేక్‌లో అభిరామ్‌ను పరిచయం చేసే ఉద్దేశం లేదు. రీమేక్ కాకుండా సోలో హీరోగానే అభిరామ్‌ను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అభిరామ్ ప్రస్తుతం హీరోగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు’ అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి త్వరలోనే కుర్ర హీరో రాబోతున్నాడన్న మాట. మరి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో వేచి చూడాల్సిందే.