టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన సినిమా యూనిట్ రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో..’ చిత్రంగా గట్టిగా పోటీ ఇస్తుండటంతో నువ్వా.. నేనా అన్నంత రీతిలో ఢీ కొంటున్నాయి!.
‘అల..’లో అలా.. ‘సరిలేరు’లో ఇలా..!
ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారనే విషయాలు దాదాపు తెలిసినప్పటికీ హీరోయిన్ రష్మిక సంగతేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పటి వరకూ ఆమె సంబంధించిన సింగిల్ లుక్ కూడా రాకపోవడం.. పాటలు విడుదల చేసినప్పటికీ సింగిల్ సాంగ్‌లో కనపడకపోవడంతో నామ మాత్రానికే రష్మిక ఉందా..? అని మహేశ్ వీరాభిమానులు, సినీ ప్రియులకు సందేహం కలుగింది. మరోవైపు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌లో త్రివిక్రమ్.. హీరోయిన్ పూజకి అన్యాయం చెయ్యకుండా 80 సెకన్ల టీజర్‌లో చూపించారని.. సరిలేరు టీజర్‌లో అందరు నటులను చూపించినా హీరోయిన్ రష్మికాను మాత్రం చూపించలేదు. దీంతో సరిలేరు సినిమా యూనిట్ అసలేం చేస్తోందో తెలియక రష్మికకు కూడా అర్థం కాని పరిస్థితి.
>ఎట్టకేలకు రష్మిక వచ్చేసిందిగా..!
అయితే తాజాగా.. ఆ అనుమానాలన్నీ పటాపంచ్‌లు చేస్తూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. ప్రతి సోమవారం ఒక్క సాంగ్ రిలీజ్ అంటూ ప్రకటించిన చిత్రబృందం ఇప్పటికే కొన్ని పుల్‌సాంగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజాగా రష్మిక మందన్నా సాంగ్‌కు సంబంధించి సాంగ్ ప్రోమోను దర్శకనిర్మాతలు విడుదల చేశారు. ఈ ప్రోమోను కాస్త వెరైటీగా ఆలోచించిన చిత్రబృందం టిక్‌టాక్‌లో రిలీజ్ చేసింది. కాగా.. ‘హీ ఈజ్ సో క్యూట్’ అని ఉంది. 00:16 సెకన్లు ఉన్న ఈ సాంగ్ ప్రోమోలో రష్మిక డ్యాన్స్ ఇరగదీసింది. ఇలా.. చిటికెలు వేస్తూ.. ముద్దొస్తున్నాడని చెబుతూ.. వీడియోలో డ్యాన్స్ రూపంలో చెప్పింది రష్మికా. మహేశ్ అందాన్ని.. హావభావాలను రష్మిక ఇందులో గట్టిగానే పొగిడింది. రష్మిక అదిరిపోయే స్టెప్పులతో మహేశ్ అభిమానులను బాగానే ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. పూర్తి సాంగ్‌ను సోమవారం (డిసెంబరు 16) సాయంత్రం 05:04 గంటలకు రిలీజ్ చేయనుంది.