Advertisementt

‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’లో ఫ్రెంచ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో విజ‌య్

Sun 15th Dec 2019 01:23 PM
vijay devarakonda,french girlfriend,world famous lover,aishwarya rajesh,izabelle leite  ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’లో ఫ్రెంచ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో విజ‌య్
Vijay Devarakonda’s French Girlfriend In World Famous Lover ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’లో ఫ్రెంచ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో విజ‌య్
Advertisement
Ads by CJ

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’. వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను ఆకట్టుకోవ‌డానికి సిద్ధమ‌వుతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఈ సినిమా ప్రమోష‌న్స్‌ను యూనిక్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ భార్య పాత్రలో న‌టిస్తోన్న ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ భార్యగా స‌ర్‌ప్రైజింగ్ పాత్రలో ఐశ్వర్యా రాజేష్ న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా శుక్రవారంనాడు ఈ సినిమాలోని మ‌రో హీరోయిన్ ఇజాబెల్లె లెయితె లుక్‌ను విడుద‌ల చేశారు. ఇజా అనే పాత్రలో న‌టిస్తోన్న ఇజా బెల్లె లెయితె ఫ్రాన్స్‌లో ఉంటుంది. ఫ్రాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క‌నెక్షన్ ఏంట‌నేది తెలియ‌సేలా ఉంది. ఐశ్వర్య రాజేశ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న పోస్టర్‌కు ఇది భిన్నమైన పోస్ట‌ర్‌. ఇందులో ఇజాబెల్లె విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను గౌత‌మ్ అని సంబోధిస్తుంది.

ఇంత‌కు ముందు విడుద‌ల చేసిన లుక్‌లో డీసెంట్ క్లీన్ షేవ్‌లో శీన‌య్యగా క‌న‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ అర్బన్ లుక్‌లో గ‌డ్డంతో ఈ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. ఈ రెండు లుక్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంట్‌గా క‌న‌ప‌డుతున్నారు. అలాగే ఈ సినిమాలో న‌టిస్తోన్న మ‌రో ఇద్దరు హీరోయిన్స్ క్యాథ‌రిన్ త్రెసా, రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల కావాల్సి ఉన్నాయి. జ‌న‌వ‌రి 3న సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది. కాగా.. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శక‌త్వంలో.. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై  కె.ఎ.వ‌ల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతాన్ని, జ‌య‌కృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Vijay Devarakonda’s French Girlfriend In World Famous Lover:

Vijay Devarakonda’s French Girlfriend In World Famous Lover  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ