Advertisementt

చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో ఆవిష్కరణ..

Mon 16th Dec 2019 09:46 PM
writer chinni krishna,studio,banner,logo  చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో ఆవిష్కరణ..
Writer chinni krishna studio banner logo చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో ఆవిష్కరణ..
Advertisement
Ads by CJ

‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’, ‘జీనియస్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించి సెన్సేషనల్ కథారచయితగా పేరుతెచ్చుకున్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ.. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌ని స్థాపించారు. తొలిప్రయత్నంగా ‘కింగ్ ఫిషర్’ వంటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే యువ టాలెంటెడ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగో విడుదల కార్యక్రమం డిసెంబర్ 16న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రఘురామకృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ  రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, యువదర్శకుడు కెయస్. రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కంజూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని  వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు.

ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ లో ఒక భాగం రచయితలు. వారికీ నిర్మాతలు పడే కష్టం తెలుసు. అందుకే మేము ఎప్పుడు నిర్మాతలు కాకూడదు అనుకున్నాం. చిన్నికృష్ణ తెలివిగలవాడు. నరసింహనాయుడు కథని అద్భుతంగా నేరేట్ చేసాడు. అప్పుడే ఇతను పెద్ద రచయిత అవుతాడని చెప్పాను. ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడని ఆచ్చర్యపోయా. బ్యానర్ లోగో చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని ఆశిస్తున్నాను. చిన్నక్రిష్ణ కొత్తగా వచ్చేవారికి అవకాశాలు ఇస్తూ.. వారిని ఎంకరేజ్ చేస్తాడని కోరుకుంటున్నా’ అన్నారు.

ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. ‘చిన్నికృష్ణ ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది. ఓటమి ఎరుగని వ్యక్తి. ఏపని చేసినా సిన్సియర్ గా, క్రమశిక్షణతో చేస్తాడు. సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కొత్తదనం కోరుకుంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్లుగా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. అలాగే చిన్నికృష్ణ రూపొందిస్తున్న కింగ్ ఫిషర్ న్యూ జోనర్ లో ఉంటుందని అలాగే తీస్తాడని ఆశిస్తున్నా. ఈ సినిమాతో పాటు చిన్నికృష్ణ నిర్మాతగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు కె.యస్.రవీంద్ర (బాబీ) మాట్లాడుతూ.. ‘మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది వుంటారు. నాకు అలాంటి వ్యక్తులు రవితేజ, శ్రీహరి, అమ్మా నాన్న తర్వాత ముఖ్యమైన వ్యక్తి చిన్నికృష్ణ. గుంటూరు నుండి వచ్చిన నన్ను ఆదరించి తనఇంట్లో ఒక మెంబర్ల చూసుకొని రచయితగా నాకంటూ ఒక స్తానం కల్పించారు. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి చిన్నికృష్ణ గారే కారణం. అలాంటి వ్యక్తిని లైఫ్ లో మర్చిపోను.. జీవితాంతం ఆయనకి రుణపడి వుంటాను. కథలైనా, వ్యాపారమైనా ఏపనైనా సీరియస్ గా  తీసుకొని చేస్తారు. బ్యానర్ లోగో చూడగానే బుజ్ బమ్స్ వచ్చాయి. అలాగే సినిమా కూడా ఉంటుందని ఈ బ్యానర్‌లో కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారనే నమ్మకంవుంది’ అన్నారు.

ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. ‘సమరసింహారెడ్డితో నా లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. అలాంటి చిత్రానికి కథ ఇచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి థాంక్స్. ఆ తర్వాత నరసింహనాయుడుతో నా కెరియర్ మరో మలుపు తిరిగింది. ఆ చిత్రానికి కథ ఇచ్చిన చిన్ని కృష్ణ గొప్ప టాలెంట్ ఉన్న రైటర్. మా చిన్ని తీస్తున్న ఈ చిత్రం లోగో ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. డెఫినెట్‌గా సూపర్ హిట్ సినిమా తీస్తాడు. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తాడని నమ్మకంవుంది’ అన్నారు.

 ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘బ్యానర్ లోగో చూడగానే కొత్త ఎనర్జీ వచ్చింది. చిన్నికృష్ణ వెన్నతాగే కృష్ణుడిలా కాకుండా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టాలని.. నూతనంగా వచ్చేవారికి అవకాశాలు కల్పిస్తాడని ఆశిస్తున్నాను’ అన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ..‘ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గట్లుగా కింగ్ ఫిషర్ టైటిల్ ఉంది. క్యాచీగా వుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. నేటివిటీ, ఎమోషన్, సెంటిమెంట్ మిస్ అవకుండా కథ రాయడంలో చిన్నికృష్ణ దిట్ట. అలాంటి వ్యక్తి ఈ సినిమా తీస్తున్నాడంటే మంచి కథ తయారు చేసేవుంటాడని అర్ధం అవుతుంది. అవకాశలకోసం ఎదురుచూసే వారికీ ఛాన్స్‌లు ఇస్తూ మరెన్నో మంచి చిత్రాలు రూపొందిస్తాడని నమ్మకంగా వుంది’ అన్నారు.

చిన్నికృష్ణ స్టూడియోస్ అధినేత చిన్నికృష్ణ మాట్లాడుతూ..‘తెనాలి నుండి సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో చెన్నపట్నం వెళ్లి భాగ్యరాజా దెగ్గర రచయితగా వర్క్ చేశాను. సుజాత రంగరాజన్‌కి ఏక లవ్యశిష్యుడిగా రచనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత పరచూరి సోదరులు బి.గోపాల్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. మా చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నటీనటులకు టెక్నీషియన్స్‌కి కుల, మతాలకు అతీతంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా సినిమాలు రూపొందించాలని పక్కాప్రణాళికతో మొదటి చిత్రంగా కింగ్ ఫిషర్‌తో స్టార్ట్ చేశాం. ఈ చిత్రానికి అత్యంత ప్రతిభ గల ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. కింగ్ ఫిషర్ అనేది మల్టిఫుల్ కలర్ వున్న ఒకరకమైన పక్షి పేరు. జనరల్‌గా కింగ్ ఫిషర్ అనగానే మత్తు, గ్యాస్ ఫిల్ చేసి కలిపి బాటిల్లో పోస్తే బీర్ అవుతుంది. అది తాగితే కిక్ ఇస్తుంది. మా కింగ్ ఫిషర్ మత్తుని వదిలిస్తుంది. 2014 నుండి ఇప్పటివరకు నేను ఎంతో మందిని చూసాను. నన్ను మోసపుచ్చిన వారిని, ఇతరులని మోసగించిన వారిని అందర్నీ పరిశీలించాను. వారి మానత్వాన్ని, హ్యూమన్ రిలేషన్స్‌ని ఒక బాటిలో పొందుపరిచాను. అదే ఈ కింగ్ ఫిషర్.. మోసగించే వాళ్ళ మత్తుని వదిలించి సమాజంలో మంచి మనుషులుగా మారుస్తుంది.. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను’ అన్నారు!!

Writer chinni krishna studio banner logo:

Writer chinni krishna studio banner logo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ