ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో తలమునకలై ఉన్నాడు. సంక్రాంతికి ముందే RRR షూటింగ్ పూర్తిచేయాలనే టార్గెట్ తో రాజమౌళి కూడా విరామమే లేకుండా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తో RRR చిత్రీకరణ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు హీరోలు, RRR ప్రమోషన్స్ విషయంలో పక్కగా ఉండబోతున్నారట. రాజమౌళితో సినిమా అంటే.. ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి తేడా రానివ్వడు. అందుకే జూనియర్ కూడా RRR సినిమా పనుల పూర్తయిన తర్వాతే మరో సినిమా మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడట.
అందుకే ఎన్టీఆర్ RRR తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదని అంటున్నారు. ఏ దర్శకుడితో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చెయ్యబోతున్నాడో క్లారిటీ ఇవ్వకుండా, తన దగ్గరికి వస్తున్న దర్శకులకు ముందు RRR తర్వాతే మరొకటి అన్నట్టుగా మాట్లాడి పంపిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అందుకే ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో కాదు, తమిళ దర్శకుడు అట్లీ... కాదు కాదు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో అంటున్నప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇప్పటికే అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి వారు ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేసి చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా ఎన్టీఆర్ మాత్రం RRR సినిమా విషయంలో చూపిస్తున్న ఇంట్రెస్ట్ వారు చెప్పబోయే కథల విషయంలో చూపించడం లేదని అందుకే.. ఎన్టీఆర్ RRR పనులతో కాస్త రిలీఫ్ అయ్యాకే వాళ్ళు కూడా కథలు చెప్పాలని డిసైడ్ అయ్యారట.