రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి RRR షూటింగ్ ని అప్పుడే 80 నుండి 85 శాతం పూర్తి చేసేసాడు. సినిమా మొదలై కూడా ఏడాది గడిచిపోయింది. కానీ ఇంతవరకు రాజమౌళి RRR టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదు. ఈ విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాజమౌళి టైటిల్ ఎనౌన్సమెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి గతంలో RRR టైటిల్ మీద టైటిల్ కాంటెస్ట్ నిర్వహించి.. ఇప్పుడు మెదలకుండా ఊరుకుని తన షూటింగ్ తాను చేసుకుంటున్నాడు. అయితే RRR టైటిల్ కాంటెస్ట్ అప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కలిసి ఎక్కువగా RRR టైటిల్ గా రామ రావణ రాజ్యం అయితే బావుంటుంది అని.. ఆ టైటిల్ కే ఎక్కువ మంది ఓటేశారు. అయితే ఫ్యాన్స్ హంగామానే కానీ... రాజమౌళి మాత్రం టైటిల్ విషయం తేల్చలేదు.
అయితే తాజాగా రామ రావణ రాజ్యం టైటిల్ ని ఓ బుల్లి నిర్మాత డైరెక్టర్స్ కలిసి తమ సినిమాకి పెట్టేసుకున్నారు. V6 అనే నిర్మాణ సంస్థ తమ సినిమాకి ఈ టైటిల్ ని పెట్టుకోవడంతో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే రాజమౌళి ఆ చిన్న సినిమాకి పెట్టుకున్న టైటిల్ పై స్పందించకపోవడంతో.. అసలు రాజమౌళి మదిలో RRR టైటిల్ వేరే ఉందిలే అందుకే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడని అంటున్నారు. అయితే రాజమౌళి కూడా RRR టైటిల్ ని పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా పెట్టాలని, అందుకే అందరికి ఎక్కేలా ఓ టైటిల్ ని అనుకున్నాడని అది ఈ సంక్రాంతికి RRR టైటిల్ ని రివీల్ చెయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎలాగూ సంక్రాంతికి RRR హడావిడి పక్కా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి... రాజమౌళి ఈ సంక్రాంతికి RRR టైటిల్ పై క్లారిటీ ఇవ్వొచ్చు.