Advertisementt

ఏషియన్ సినిమాస్‌కి ‘సవారీ’ నైజాం రైట్స్!

Sat 21st Dec 2019 11:46 AM
asian cinemas,theatrical rights,savaari,nizam,nandu,priyanka sharma  ఏషియన్ సినిమాస్‌కి ‘సవారీ’ నైజాం రైట్స్!
Asian Cinemas Acquires The Theatrical Rights Of ‘Savaari’ Movie in Nizam ఏషియన్ సినిమాస్‌కి ‘సవారీ’ నైజాం రైట్స్!
Advertisement
Ads by CJ

సవారీ నైజాం థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ఏషియన్ సినిమాస్..

నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ సవారీ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. సవారీ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉంది. సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఏషియన్ సినిమాస్ నైజాం రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్.

నటీనటులు: నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు..

టెక్నికల్ టీం:

దర్శకుడు: సాహిత్ మోత్కూరి

నిర్మాతలు: సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి

నైజాం విడుదల: ఏషియన్ సినిమాస్

సంగీతం: శేఖర్ చంద్ర

Asian Cinemas Acquires The Theatrical Rights Of ‘Savaari’ Movie in Nizam:

Nandu and Priyanka Sharma starrer ‘SAVAARI’ is all set for grand release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ