నిన్న శుక్రవారం విడుదలైన ప్రతిరోజు పండగే సినిమాకి ఆల్మోస్ట్ హిట్ టాక్ పడినట్లే కనబడుతుంది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే సినిమాలో ఫస్ట్ హాఫ్ లో హిలేరియస్ కామెడీ పండగా.. సెకండ్ హాఫ్ ఆకట్టుకోలేని ఎమోషన్స్ తో ఢీలా పడడంతో జస్ట్ హిట్ టాక్ పడింది కానీ.. లేదంటే సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. మారుతీ మార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఇరగదీసిన... సెకండ్ హాఫ్ లో కామెడీ పక్కన పడేసి.. బలహీనమైన ఎమోషన్స్ తో సినిమాని లాగించేసాడు. ఇక సినిమాలో ఇప్పుడు హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో ఓ కాంటెస్ట్ మొదలయ్యింది. ఆదేమిటి సాయి తేజ్ హీరో కదా... మళ్ళి హీరో ఏవంటారేమిటి అనుకుంటున్నారా...
సాయి తేజ్ హీరోనే కాకపోతే సాయి తేజ్ నటన కన్నా తాతగా సత్య రాజ్ నటనే ఎక్కువ హైలెట్ అవుతుంది. సాయి తేజ్ సిక్స్ ప్యాక్, నటన సాఫ్ట్ గా ఉన్నప్పటికీ సత్య రాజ్ నటన ముందు సాయి తేజ్ తేలిపోయాడనే చెప్పాలి. ఇక ఎప్పుడు విలన్ గానో, లేదంటే తండ్రి పాత్రలకు అదిరిపోయే నటన కనబర్చే రావు రమేష్ ఈ సినిమాకి కీలకం. సత్య రాజ్ కొడుకుగా సాయి తేజ్ తండ్రిగా రావు రమేష్ నటన సినిమాకే హైలెట్. రావు రమేష్ కామెడీ టైమింగ్ అబ్బో అదుర్స్ అన్న రేంజ్ లో ప్రతిరోజు పండగే సినిమాలో కనబడుతుంది. రావు రమేష్ కెరీర్ లోనే బెస్ట్ కేరెక్టర్. పెరఫార్మెన్స్ అదుర్స్, అసలు రావు రమేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సన్నివేశాల్లో ఆయన హావభావాలకు.. మాట విరుపులకు థియేటర్లు హోరెత్తిపోయాయి. తన ఫ్రస్టేషన్ తోనే కామెడీ వడ్డించాడు. మరి ఈలెక్కన పండగలో హీరో ఎవరో మీరే చెప్పాలి.