Advertisementt

‘రొమాంటిక్‌’.. పూరి రాసిన సాంగొచ్చింది

Sun 22nd Dec 2019 06:51 PM
puri jagannath,penned lyrics,romantic,movie,nuvvu nenu e kshanam,song,release  ‘రొమాంటిక్‌’.. పూరి రాసిన సాంగొచ్చింది
Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out ‘రొమాంటిక్‌’.. పూరి రాసిన సాంగొచ్చింది
Advertisement
Ads by CJ

‘రొమాంటిక్‌’ చిత్రంలో ‘నువ్వు నేను ఈ క్షణం..’ పాట రాసిన పూరి జగన్నాథ్‌

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. ఈ సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సినిమాలో తొలిపాట ‘నువ్వు  నేను ఈ క్షణం..’ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పోస్టర్స్‌లో హీరో హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీతో పాటు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ పాటను రాయడంతో  సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా ఈ సాంగ్‌ను హీరో హీరోయిన్లపై గోవాలో చిత్రీకరించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

పూరి జగన్నాథ్‌ వాయిస్‌తో ఈ పాట ప్రారంభమైంది. పూరితో పాటు చిన్మయి, ఆకాష్‌ పూరి వాయిస్‌లు ఈ పాటలో ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకునేలా సాంగ్‌ ఉంది. నరేష్‌ ఈ సాంగ్‌ను అద్భుతమైన విజువల్స్‌తో పిక్చరైజ్‌ చేశారు.

కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. ఈ ఇన్‌టెన్స్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను అనిల్‌ పాదూరి డైరెక్ట్‌ చేశారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం, నరేష్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్‌ పతాకాలపై ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పూరిజగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తోన్న చిత్రమిది.

న‌టీన‌టులు:

ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  అనిల్ పాదూరి

నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి

స‌మ‌ర్ప‌ణ‌:  లావ‌ణ్య‌

సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌

సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్

ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖి

ఆర్ట్‌:  జానీ షేక్‌

పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల‌

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Click Here for Song

Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out:

Romantic Movie Nuvvu Nenu E Kshanam Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ