‘రూలర్’ చిత్రాన్ని విజయంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ - ‘‘జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్రఫీ అందించడం హ్యాపీగా ఉంది. అలాగే కల్యాణ్‌గారి బ్యానర్లో మూడో సినిమా చేస్తున్నాను. బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.
పరుచూరి మురళి మాట్లాడుతూ - ‘‘బాలకృష్ణగారి గురించి నేను ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. నిర్మాత కల్యాణ్‌గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఇలాంటి నిర్మాతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు.
వేదిక మాట్లాడుతూ - ‘‘సినిమాను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. బాలకృష్ణలాంటి హీరోతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. హీరోగానే కాదు.. వ్యక్తిగా కూడా ఆయనెంతో మంచివారు. కల్యాణ్‌గారు అందరినీ ఎంతో కేర్‌గా చూసుకున్నారు. ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు, బాలకృష్ణగారికి థ్యాంక్స్’’ అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘జైసింహా తర్వాత మరోసారి మా కాంబినేషన్లో వచ్చిన రూలర్ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. రాంప్రసాద్‌గారు సినిమాను అద్భుతంగా విజువలైజ్ చేసి చూపించారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఐదు నెలలు పాటు టీం అందరం ఎంతగానో హార్డ్ వర్క్ చేశాం. మళ్లీ నెక్ట్స్ సినిమాను కూడా దీని కంటే మంచి సినిమా ఇస్తానని తెలియజేస్తున్నాను’’ అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘రూలర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఓ మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు ప్రేక్షకులు. కల్యాణ్‌గారు ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి కథా విలువలున్న సినిమా చేయాలని భావించే నిర్మాత ఆయన. ఆయనకు నా తరపున, అభిమానుల తరపున కృతజ్ఞతలు. వి.ఎస్.ఆర్.స్వామిగారి వద్ద శిష్యరికం చేసిన రాంప్రసాద్‌గారు ఈ సినిమాకు మంచి విజువల్స్‌ను అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. హీరోయిన్స్ సోనాల్, వేదిక చక్కగా నటించారు. జయసుధగారు, ప్రకాష్‌రాజు, సప్తగిరి, ధన్‌రాజ్, రఘు గారు అందరూ చక్కగా నటించారు. పరుచూరి మురళిగారు మంచి కథను అందించారు. మంచి డైలాగ్స్‌ను కూడా అందించారు. మంచి మెసేజ్‌ను కూడా ఈ కథలో చొప్పించారు మురళిగారు. ఆయనకు థ్యాంక్స్. డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్‌గారు ఆర్టిస్టుల దగ్గర నుండి ఏం కావాలో ఆ నటనను రాబట్టుకునే దర్శకుడు. అలాగే నిర్మాతల దర్శకుడు కూడా ఆయన. చిరంతన్ భట్‌తో నేను చేసిన మూడో సినిమా. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.