రామ్ చరణ్ కెరీర్ లోనే రంగస్థలం బెస్ట్ ఫిలిం. కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి మరిచిపోలేని సినిమా. మరి ఈ రెండు బరిలో ఉంటే ఈ సినిమాలకు కాక ఇంకే సినిమాలను అవార్డులు వరిస్తాయి. ఈ ఏడాది సౌత్ నుండి జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో రామ్ చరణ్ తో రంగస్థలం, మహానటి కీర్తి సురేష్ ఫిలింఫేర్ అవార్డ్స్ అన్ని ఎగరేసుకుపోయారు. రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు వరించగా... బెస్ట్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక బెస్ట్ ఫిలిం కేటగిరిలో మహానటి సినిమాకి, బెస్ట్ దర్శకుడిగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ రంగస్థలం, ఇలా అన్ని కేటగిరీస్ లో మహానటి, రంగస్థలం జోరు కొనసాగింది.
చెన్నై వేదికగా గత రాత్రి ఫిలింఫేర్ సౌత్ 2019 అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ నుండి రంగస్థలం, మహానటి మేజర్ పార్ట్ అవార్డ్స్ కొల్లగొట్టగా.. అరవింద సమేతకి బెస్ట్ విలన్ గా జగపతి బాబు, బెస్ట్ క్రిటిక్స్ యాక్ట్రెస్ గా రష్మిక మందన్న గీత గోవిందంకి గాను, అవార్డ్స్ అందుకున్నారు. రంగస్థలం, మహానటి ధాటికి అవార్డ్స్ అన్ని ఆ రెండు చిత్రాలకే సరిపోయాయి. మధ్యలో అరవింద సమేత ఒకటి, గీత గోవిందం రెండు అవార్డ్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.