Advertisementt

ఫారెన్సిక్ డాక్టర్‌గా ఆది సాయికుమార్

Mon 23rd Dec 2019 03:35 PM
aadi saikumar,forensic doctor,new movie announcement,birthday special  ఫారెన్సిక్ డాక్టర్‌గా ఆది సాయికుమార్
Hero Aadi Saikumar New film announcement ఫారెన్సిక్ డాక్టర్‌గా ఆది సాయికుమార్
Advertisement
Ads by CJ

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ థ్రిల్లర్‌లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్‌గా థ్రిల్ చేయబోతున్నాడు. మరుధూరి ఎంటర్‌టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో ఆది ఒక కొత్త పాత్రలో పరిచయం కాబోతున్నాడు.

శివ శంకర్ దేవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త కాన్సెప్ట్‌ని తెరమీద చూపించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

బ్యానర్స్: మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్

డైరెక్టర్: శివశంకర్ దేవ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. సాయికిరణ్, ప్రతాని శ్రీనివాస్ గౌడ్, అనీల్ మైలాపురమ్, 

పి.ఆర్.ఓ. జియస్ కె మీడియా

Hero Aadi Saikumar New film announcement:

Aadi Saikumar turns forensic doctor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ