దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే కొత్త నటుల్ని కాదు.. కొత్త హీరోయిన్స్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తూనే ఉంటాడన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలామంది టాప్ మోస్ట్ హీరోయిన్స్ అయినా వారు ఉన్నారు. ఇక కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలకే చుట్టేశారు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ తన ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండ కోసం సేఫ్ గేమ్‌గా బాలీవుడ్ నుండి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని దింపుతున్నాడు. శ్రీదేవి కూతురు అనగానే సౌత్‌లో సాఫ్ట్ కార్నెర్ రావడం ఖాయం.. ఇక బాలీవుడ్‌లో ఎలాగూ జాన్వికి ఓ క్రేజ్ ఉంది. సో.. జాన్వీ కపూర్‌తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. పూరి అని అనుకున్నంతలో ఇప్పుడు పూరి మరో హీరోయిన్ కోసం వెతుకున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతోంది.
విజయ్ దేవరకొండ కోసం ఇప్పుడు మరో హీరోయిన్‌ని పూరి సెట్ చేయబోతున్నాడట. ఎప్పటిలాగే ఓ కొత్త అమ్మాయి కోసం పూరి సెర్చింగ్ చేస్తున్నాడని, ఫాస్ట్‌గా ఉండే ముంబై మోడల్ అయితే బావుంటుందని భావిస్తున్న పూరి.. విజయ్ కోసం ఓ ముంబై మోడల్‌ని హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నాడనే టాక్ ఫిలింనగర్‌లో గట్టిగా వినబడుతుంది. మరి ఇప్పటికే పాన్ ఇండియా ఫిలింగా ‘ఫైటర్’ ని మార్చిన పూరి ఇప్పుడు ఆ సినిమా కోసం భారీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.