Advertisementt

‘అల వైకుంఠపురం...’ నుంచి ‘బుట్ట బొమ్మ’ వచ్చింది!

Wed 25th Dec 2019 07:52 PM
butta bomma,allu arjun,ala vaikunthapurramuloo,bunny-ttivikram movie  ‘అల వైకుంఠపురం...’ నుంచి ‘బుట్ట బొమ్మ’ వచ్చింది!
‘Butta Bomma’ song from Allu Arjun’s Ala Vaikunthapurramuloo garners good buzz ‘అల వైకుంఠపురం...’ నుంచి ‘బుట్ట బొమ్మ’ వచ్చింది!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రంలోని మరో పాట ఈ రోజు (24-12-19) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సామాజిక మాధ్యమం అయిన ‘యూ ట్యూబ్’ ద్వారా విడుదలైంది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు ‘అర్మాన్ మాలిక్’ అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో మరోసారి సంచలనం సృష్టించారు. ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే’ అంటూ సాగే ఈ గీతం టీజర్ ఇటీవల విడుదలై పాట ఎప్పుడు విడుదల అవుతుందా..? అని ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు విడుదల అయిన ఈ పూర్తి గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాల రికార్డ్‌ల సరసన చేరే దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదలవుతోంది.

నటీనటులు :-

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు : డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,

ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

‘Butta Bomma’ song from Allu Arjun’s Ala Vaikunthapurramuloo garners good buzz:

  ‘Butta Bomma’ song from Allu Arjun’s Ala Vaikunthapurramuloo garners good buzz

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ