టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిస్మస్ వేడుకలు విదేశాల్లో జరుపుకుంటున్నట్లు తెలిసింది. తన మూడో భార్య అన్నా లెజెనోవా కుటుంబ సభ్యులతో కలిసి పవన్ రష్యాలో పండుగ చేసుకుంటున్నారు. రెండ్రోజుల క్రితమే పవన్.. తన భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి రష్యా వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో కొందరు అభిమానులు తన కెమెరాలకు పని చెప్పారు. పవన్ సతీమణి అన్నాలెజినోవా స్వదేశం రష్యా అన్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.
‘మూడో భార్యతో రష్యాకు చెక్కేస్తున్న పవన్..’ అంటూ క్యాప్షన్లు పెట్టి జనసేనాని-అన్నా లెజినోవో ఎయిర్‌పోర్టులో వెళ్తున్న ఫొటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. జగన్‌ను మతమార్పిడి అంటూ టార్గెట్ చేసే పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నాడు? అంటూ కొందరు పశ్నిస్తూ.. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఇంట్లోనే న్యాయం చేయలేనివాడు బయటికి వచ్చి జగన్‌ను ఎందుకు అంటున్నాడు? అంటూ పవన్‌పై వైసీపీ వీరాభిమానులు, కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. అన్నా లెజినోవా క్రిస్టియన్ కాబట్టే ఆమెకు గౌరవం ఇచ్చి రష్యాకు వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడని.. అందులో తప్పేముంది..? అని ట్రోలింగ్స్ చేస్తున్న వారికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్లిస్తున్నారు. అయితే ఆ ఫొటో ఇప్పట్లో తీసిందా లేకుంటే.. గతంలో తీసిన ఫొటోను ఇలా వైరల్ చేస్తున్నారా..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. మొత్తానికి చూస్తే మరోసారి సోషల్ మీడియాలో పవన్ హాట్ టాపిక్ అవ్వగా.. జనసేన ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్‌గా పరిస్థితులు మారాయి. పవన్ నిజంగానే రష్యా వెళ్లారా లేదా..? అనేది మాత్రం తెలియరాలేదు.
కాగా.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఓడినా.. పవన్ మాత్రం ప్రజా సమస్యలు లేవనెత్తి.. ప్రభుత్వం చేసే తప్పొప్పులను ఎత్తి చూపిస్తూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. నిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చేశాడని.. త్వరలోనే ‘పింక్’ రీమేక్ మూవీలో బిజిబిజీగా ఉన్నాడని కూడా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు షురూ అయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు పింక్ రీమేక్ అవ్వగానే క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.