Advertisementt

అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా..’

Thu 26th Dec 2019 06:34 PM
radhera movie,purdhvi,thirty years prudhvi,praises  అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా..’
News About Radhera Movie... అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా..’
Advertisement
Ads by CJ

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రథేరా’. జాకట రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ చేసిన ‘దంగల్’ చిత్రం తరహాలో ‘రథేరా చిత్రం’ ఉండబోతోంది. టీజర్ చాలా బాగుంది.. లోకల్ ట్యాలెంట్‌తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను రింగ్ టోన్స్‌గా పెట్టుకోవచ్చు.. అంత క్యాచీగా ఉన్నాయి. సినిమా హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

నిర్మాత, హీరో జుకేట్ రమేష్ మాట్లాడుతూ.. ‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన వి.వి.వినాయక్ గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. టీజర్ చూసిన అందరూ బాగుంది అంటున్నారు. జనవరి 2020 మోదటివారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్రం చేస్తున్నాము, ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ బాగా చేశారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలువుతాం’ అన్నారు. 

దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ‘మా రథేరా సినిమాను కొందరు సినీ ప్రముఖులు చూసి బాగుంది అన్నారు. రేపు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ నుంచి అదే ఫీడ్ బ్యాక్ వస్తుందని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సిద్దేశ్వర్ రావ్ గారికి ధన్యవాదాలు, క్రీడా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది’ అని అన్నారు.

నటీనటులు :-

సిద్దు, మానస,వై. ఎస్.కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకరం, రమాదేవి, మంజు, నాని, రాజేష్,సాయి, జానీ, కార్తీక్

సాంకేతిక నిపుణులు :-

డబ్బింగ్ : డీజీకీస్ట్

పి.ఆర్. ఓ: మధు విఆర్

డి.టి.ఎస్: పద్మారావ్

మ్యూజిక్: సిద్ధార్థ్

కెమెరా - ఎడిటర్ - కథ - స్క్రీన్ ప్లే - మాటలు -దర్శకత్వం: రమేష్ జాకట 

నిర్మాతలు: సిద్దేశ్వర్ రావ్ , నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి

News About Radhera Movie...:

News About Radhera Movie...  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ