Advertisementt

ఆ ఒక్క కారణం వల్లే రష్మిక పెళ్లి రద్దు!

Thu 26th Dec 2019 07:03 PM
rashmika mandanna,marriage,rakshit shetty,geetha govindam beauty  ఆ ఒక్క కారణం వల్లే రష్మిక పెళ్లి రద్దు!
Why Rashmika Mandanna Cancel Marriage.. Here Details..! ఆ ఒక్క కారణం వల్లే రష్మిక పెళ్లి రద్దు!
Advertisement
Ads by CJ

కన్నడ భామ రష్మిక మందన్నా మంచి దూకుడు ఉంది. ఓ వైపు వరుసగా సినిమాలన్నీ హిట్టవ్వడం.. మరోవైపు స్టార్ హీరోలతో చేస్తున్నానని ఫీలింగ్‌తో ఆనందంలో మునిగి తేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘గీత గోవిందం’ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే.. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన పెళ్లి రద్దైన వ్యవహారం మాత్రం ఇంకా ఈమెను వెంటాడుతూనే ఉంది. ఇంత జరిగినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈమె క్రేజ్‌ను వాడుకొని పేరు తెచ్చుకోవాలని మాజీ ప్రియుడు రక్షిత్ తహతహలాడుతున్నాడు. అంతేకాదు.. సినిమా ప్రమోషన్స్‌లో కూడా రష్మిక పేరు వాడి హడావుడి చేస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు..? ఏ పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది..? ఇద్దరూ వేరవ్వడానికి గల కారణాలేంటి..? అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు.

ఆ ఒక్కటే కారణం!

అయితే తాజాగా.. రష్మికనే స్వయంగా స్పందించి పెళ్లి పెటాలకులైన వ్యవహారంపై క్లారిటీ ఇచ్చుకుంది. ‘రక్షిత్‌పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే కారణంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని అనుకున్నాం. రెండేళ్లు గడిచిన తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో పెళ్లికి సమయం కేటాయించడం సాధ్యం కాలేదు. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని నేను భావించాను. కేవలం ఈ ఒక్క కారణం వల్లనే మేం పెళ్లిని రద్దు చేసుకున్నాం’ అని రష్మిక చెప్పుకొచ్చింది. 

రక్షిత్ ఏమంటున్నాడు!

ఇదిలా ఉంటే.. ‘రష్మికకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఆమె గతంలో ఎలా ఉండేదో నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ కలలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలుసు. ఆమె కన్న కలలు అన్నీ నిజం కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్రేమ, బ్రేకప్, పెళ్లి.. అనేవి జీవితంలో చిన్న చిన్న విషయాలే. జీవితం మనకు చాలా రకాల అనుభవాలను పరిచయం చేస్తుంది. అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. అలా మనకు ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోడమే మనం చేయాల్సిన పని’ అని రక్షిత్ ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు.

Why Rashmika Mandanna Cancel Marriage.. Here Details..!:

Why Rashmika Mandanna Cancel Marriage.. Here Details..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ