Advertisementt

‘అల వైకుంఠపురంలో..’ హైలెట్స్ అవేనా?

Fri 27th Dec 2019 07:50 AM
ala vykuntapuram lo movie,highlights,allu arjun,samudralhani,dialogues  ‘అల వైకుంఠపురంలో..’ హైలెట్స్ అవేనా?
Ala vykuntapuram lo Movie Highlights.. Here Details ‘అల వైకుంఠపురంలో..’ హైలెట్స్ అవేనా?
Advertisement
Ads by CJ

‘అల వైకుంఠపురంలో..’లో సాంగ్స్ మాత్రం మార్కెట్‌ని అల్లాడించేస్తున్నాయి. మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా ఈ సాంగ్స్‌ని పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఈ మ్యూజిక్ ఆల్బమ్‌తోనే సగం హిట్ కొట్టేశారనిపిస్తుంది. ఇక సాంగ్స్ ఇలా ఉంటే.. సినిమాలో కామెడీ పంచ్‌లు ఎలా వుంటాయో.. త్రివిక్రమ్ కామెడీ పంచ్‌లపై ఓ రేంజ్ ఊహాగానాలు మొదలయ్యాయి. ‘జులాయి’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కి అల్లు అర్జున్ ఎక్స్‌ప్రెషన్స్ తోడవ్వడంతో.. ఆ సినిమాలు హిట్ అయ్యాయి.

మరి ‘అల వైకుంఠపురంలో..’లో కూడా అల్లు అర్జున్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, స్టైయిల్ అన్ని త్రివిక్రమ్ పంచ్‌లకు అనుగుణంగా ఉన్నాయ్. ఇప్పటికే ‘అల వైకుంఠపురంలో..’ టీజర్‌లో సముద్రఖని.. అల్లు అర్జున్ సీన్‌కి ఎక్కవ క్రేజ్ వచ్చింది. ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే కేరెక్టర్ ఎక్కా..’ అంటూ సూపర్ స్టైయిల్లో ఇచ్చిన అల్లు అర్జున్ పంచ్ సూపర్‌గా పేలింది. మరి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని.. సినిమాలో సముద్రఖని.. అల్లు అర్జున్ కాంబో సీన్స్‌కి కామెడీతో కూడిన యాక్షన్ లాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయని... అవే సినిమాకి హైలెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Ala vykuntapuram lo Movie Highlights.. Here Details:

Ala vykuntapuram lo Movie Highlights..  Here Details  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ