పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఆఫీషియల్‌గా పట్టాలెక్కేసింది. మూడునాలుగేళ్లుగా రాజకీయాల్లో పడి సినిమాలు వదిలేసిన పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే నాలుగేళ్లుగా ఒకే డ్రెస్ కోడ్‌తో ఉన్న పవన్ కళ్యాణ్ గెడ్డం పెంచేసి, హెయిర్ స్టయిల్ మార్చేశాడు. మరి ‘పింక్’ సినిమాలో అమితాబ్ కాస్త ఏజ్డ్‌గా కనిపించాడు. కాబట్టి ‘పింక్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఇపుడున్న లుక్‌లో నటిస్తే సరిపోనుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం పవన్ పొలిటికల్ లుక్ మార్చకపోతే ఊరుకునేలా లేరు. ఇప్పటికే పవన్ ‘పింక్’ రీమేక్ ఎలా ఒప్పుకున్నాడో అంటూ రాగాలు తీస్తున్నారు. అయితే వేణు శ్రీరామ్ పవన్ క్రేజ్‌ని ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని..‘పింక్’ రీమేక్ కోసం పవన్ కేరెక్టర్‌ని కాస్త మిడిల్ ఏజ్‌గా మార్చడంతో పాటుగా హీరోయిజాన్ని హైలెట్ చేయబోతున్నాడట. ఇక లుక్‌లో కూడా పవన్ కళ్యాణ్ కాస్ట్ స్టయిల్ మార్చునున్నాడని తెలుస్తుంది. ఇక ‘పింక్’ రీమేక్‌కి బడ్జెట్ కూడా తక్కువేనట.
దిల్ రాజు ఈ సినిమాకి పెట్టే ఖర్చులో 50 కోట్లు పవన్‌కి పోతే అంటే సినిమా బడ్జెట్‌లో 75 శాతం పవన్‌కి పారితోషకం ఇస్తుంటే.. సినిమాకి 25 శాతం పెడుతున్నాడట. ఇక హీరోయిన్స్ కూడా పెద్దగా పేరున్న హీరోయిన్స్ కాకపోబట్టి.. అంజలి, నివేథ, మరో హీరోయిన్‌కి కలిపి కోటి లోపే ఉండబోతుంది అని.. ఇక సినిమా కూడా ఎక్కువగా ఒకే భవనం అంటే కోర్టు హాలులోనే ఉండబోతుంది కాబట్టి. ఓ భవనం సెట్ వేసి సినిమాని లాగించేయొచ్చు. అందుకే దిల్ రాజు ఈ రీమేక్ తో పవన్‌ని ఒప్పించి క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి సినిమాని మొదలెట్టాడని టాక్.