Advertisementt

రాజ్ తరుణ్ త్యాగానికి..ఫలితం లేకుండా పోయింది!

Sat 28th Dec 2019 01:46 PM
no useful,young hero raj tarun,sacrifice,dil raju,iddari lokam okkate  రాజ్ తరుణ్ త్యాగానికి..ఫలితం లేకుండా పోయింది!
No Useful For young Hero Raj Tarun Sacrifice!! రాజ్ తరుణ్ త్యాగానికి..ఫలితం లేకుండా పోయింది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో యువ కెరటంలా దూసుకొచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం ప్లాప్స్‌తో కొట్టుకుంటున్నాడు. వరస ప్లాప్స్‌తో సతమతమవుతున్న రాజ్ తరుణ్.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుని నమ్ముకుని.. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అంటూ బరిలోకి దిగాడు. కానీ దిల్ రాజు కూడా రాజ్ తరుణ్‌ని కాపాడలేకపోయాడు. కాకపోతే దిల్ రాజు, రాజ్ తరుణ్ మీద రిస్క్ చేసి బడ్జెట్ పెట్టలేదు గనుక స్వల్ప నష్టాలతో బయటపడేలా ఉన్నాడు. ఎందుకంటే గత బుధవారం విడుదలైన ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమా మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడమే కాదు.. సినిమాకి ప్లాప్ టాక్ పడిపోయింది.

మరి ఈ సినిమా కోసం రాజ్ తరుణ్, దిల్ రాజు దగ్గర రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమా హిట్ అయితే అపుడు చూద్దాం అన్న రేంజ్‌లో దిల్ రాజుని నమ్మాడు. ఇక దిల్ రాజు అదే నమ్మకంతో రాజ్ తరుణ్ సినిమాని నిర్మించాడు. కాకపోతే రాజ్ తరుణ్ మాత్రం తన ఖర్చుల కోసం నెలకి ఇంటిని శాలరీ తీసుకునేవాడట. మరి పారితోషకం లేకుండా త్యాగం చేసి.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయాడనిపిస్తుంది. ఎందుకంటే మొదటి రోజే పేలవంగా మొదలైన ఇద్దరి లోకం ఒక్కటే సినిమా రెండో రోజు దారుణంగా పడిపోయింది. అసలు ఇద్దరి లోకం ఒకటే సినిమాకి రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా వుడనడంతో.. ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గట్టెక్కడం కష్టంగానే కనబడుతుంది. పాపం ఏదైనా రాజ్ తరుణ్ త్యాగానికి అర్ధం లేకుండా పోయింది.

No Useful For young Hero Raj Tarun Sacrifice!!:

No Useful For young Hero Raj Tarun Sacrifice!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ