పవన్ కళ్యాణ్ క్రేజ్ రాజకీయాల్లోకి వెళ్ళాక తగ్గిందా? పెరిగిందా? అనేది కాస్త డౌట్. ఎందుకంటే సినిమాల్లో భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోవడం దానికి పెద్ద ఉదాహరణే. అయితే మళ్ళీ పవన్ సినిమాల్లోకి వస్తున్నాడు అనగానే ఆయన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంటే రాజకీయాల్లో పనికి రాణి పవన్ కళ్యాణ్ ఇమేజ్ సినిమాల్లో అయితే ఓకె. మరి తన క్రేజ్ దృష్ట్యా.... నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లకు సినిమాలు చెయ్యాలి, అలాగే తనకి మనీ అవసరం కాబట్టే... పవన్ మళ్ళీ సినిమాల వైపు మొగ్గు చూపదు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మాత్రం ఖరీదుతో కూడుకున్న పనే. కాకపోతే పవన్ క్రేజ్ నిర్మాతలకు వరం.
అందుకే దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన 25 రోజుల డేట్స్ ని వరం లా భవించి ఆయనకి 50 కోట్ల పారితోషకం ఇవ్వబోతున్నాడు. అయితే పింక్ రీమేక్ కి పవన్ కళ్యాణ్ ఒప్పించడం, ఆయనకి 50 కోట్ల పారితోషకం, సినిమాకి 25 కోట్ల బడ్జెట్ అంటూ దిల్ రాజు పక్కా ప్లాన్ ఉన్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ కి 25 రోజులకి 50 కోట్ల పారితోషకం అంటే మాత్రం షాకవ్వాల్సిందే. మరి మంచి ఫామ్ అండ్ క్రేజ్ లో ఉన్న పవన్ రాజకీయాలతో సినిమాలకు బ్రేకిచ్చిన.. మళ్ళీ సినిమాల్లోకి అడుగెడుతున్న ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చేప్పాలి. అందుకే దిల్ రాజు సాహసం చేస్తున్నాడు.