Advertisementt

కొరటాల మూవీలో చిరు పాత్ర లీకైందిగా!?

Sun 29th Dec 2019 09:04 AM
chiru role,leaks,koratala shiva,koratala-chiru movie  కొరటాల మూవీలో చిరు పాత్ర లీకైందిగా!?
Chiru Role Leaked In Koratala Movie.. Details Here..!! కొరటాల మూవీలో చిరు పాత్ర లీకైందిగా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి షూటింగ్ షురూ చేసిన చిత్రబృందం.. చిరు సరసన హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి.. టాలీవుడ్‌లో ఉండేవాళ్లే సరిపోతారా..? కోలీవుడ్, బాలీవుడ్ నుంచి పట్టుకురావాలా..? అని కొరటాల యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఇదిగో స్టోరీ రివీల్ అయిపోయింది..? కథ ఇదే..? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. చిరు పాత్ర కూడా రివీల్ అయిపోయిందని తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో చిరు కనిపించి మెగాభిమానులను, సినీ ప్రియులను మెప్పిస్తాడని తెలుస్తోంది. దేవదాయశాఖలో ఓ అధికారిగా ఉంటారట. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ భూములపై కొందరు కన్నేసి ఆక్రమించుకోవడానికి యత్నిస్తారట. అప్పుడు మెగాస్టార్ రంగంలోకి దిగి భూ కబ్జాదారుల తాట తీస్తారట. అలా సగం సినిమా నడుస్తుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొరటాల కథ లీకైందంటూ ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయ్. మరి ఇందులో నిజమెంతో..!

ఈ పాత్రకు తగ్గట్లే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాల్లో సెట్స్‌ వేస్తున్నారని టాక్. త్వరలోనే షూటింగ్ షురూ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. మరోవైపు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం కోకాపేట్‌లో ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ని నిర్మించారని టాక్ నడుస్తోంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌ని సంక్రాంతి వ‌ర‌కు పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట. కాగా.. కొణిదెల ప్రొడ‌క్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచ‌నాలే వున్నాయి.

Chiru Role Leaked In Koratala Movie.. Details Here..!!:

Chiru Role Leaked In Koratala Movie.. Details Here..!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ