ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలతో విజయపథంలో దూసుకెళ్తుతోంది. నవ్యమైన కథ,కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాల్లో స్థానం సంపాందించుకుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన యంగ్ రెబల్‌స్టార్ పాన్ ఇండియా కథానాయకుడు ప్రభాస్ ప్రత్యేకంగా అభినందించారు. షూటింగ్‌తో ఎంతో బిజీగా వున్న సినిమాపై వున్న ఆసక్తితో ఈ చిత్రాన్ని చూసిన ప్రభాస్ చిత్ర యూనిట్ అందరికి తన శుభాకాంక్షలు అందజేశాడు.