Advertisementt

కియారా అద్వానీ గాల్లో తేలుతోందిగా..!!

Tue 31st Dec 2019 09:57 PM
kiara advani,tollywood,bollywood  కియారా అద్వానీ గాల్లో తేలుతోందిగా..!!
Interesting News On Kiara Advani! కియారా అద్వానీ గాల్లో తేలుతోందిగా..!!
Advertisement
Ads by CJ

తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్స్ పక్కన నటించినా రాని ఫెమ్.. కియారా అద్వానీకి బాలీవుడ్ లో తెలుగు రీమేక్ చెయ్యగానే.. కుప్పలు తెప్పలుగా క్రేజ్ రావడంతో.. అక్కడ బడా హీరోయిన్ అవతారమెత్తింది. బాలీవుడ్ నుండి తెలుక్కి వచ్చి సక్సెస్ కాక బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కినా కియారా అద్వానీకి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. వరసబెట్టి సినిమాలు చెయ్యడమే కాదు.. వరసబెట్టి హిట్స్ కొడుతోంది పాప. కబీర్ సింగ్ తో ఓ రేంజ్ హిట్ అందుకున్న కియారా అద్వానీ తాజాగా గుడ్ న్యూస్ తో డీసెంట్ హిట్ కొట్టింది. అక్షయ్ కుమార్ - కరీనా కపూర్, ధిల్జిత్ దొసాంగ్ - కియారా లు జంటలుగా గత శుక్రవారం విడుదలైన గుడ్ న్యూజ్ డీసెంట్ టాక్ తో  మొదటి రోజు 17.56 కోట్ల వసూళ్లు రాబట్టి.. రెండవ రోజు ఏమాత్రం తగ్గకుండా శనివారం 21.78 కోట్లు కొల్లగొట్టడమే కాదు.. నిన్న ఆదివారం కూడా థియేటర్స్ అన్ని కళకళలాడాయి.

మరి గుడ్ న్యూజ్ సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది.. అక్షయ్ కుమార్ కరీనా కపూర్, కియారా అద్వానీ, ధిల్జిత్ దోషాన్త్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ బాలీవుడ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ట్రాక్ లో ఉండగా.. సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న గందరగోళాల కారణంగా హిట్ టాక్ పడింది కానీ.. లేదంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ కెరీర్ బెస్ట్ పెరఫామెన్స్  హాస్యంతో ఆకట్టుకోగా. కరీనా  కపూర్ కూడా కామెడీగా.. ఎమోషనల్ నటనతో అదరగొట్టేసింది. ధిల్జిత్ దొసాంగ్ - కియారా ల కేరెక్టర్స్ మధ్యన న కాస్త అతి అనిపించినా.. వారు కూడా బాగానే నటించి మెప్పించారు. మరి కబీర్ సింగ్ హిట్.. ఇప్పుడు గుడ్ న్యూజ్ హిట్. ఇక కియారా వరస హిట్స్‌తో గాల్లో తేలిపోతుంది. 

Interesting News On Kiara Advani!:

Interesting News On Kiara Advani!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ