ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో.. అసలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందో.. లేదో.. అనే విషయం తెలియదు. ఎందుకంటే రాజమౌళి తన అన్నగారు కీరవాణి పిల్లల సినిమా గురించిన ప్రమోషన్స్‌లో తెగ హడావిడి చేస్తున్నాడు. కీరవాణి కొడుకులు సింహ, కాల భైరవ కలిసి చేసిన మత్తువదలరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరనుండి.. ఆ సినిమా ప్రీమియర్ వరకు అంటే ఓకె.. కానీ సినిమా విడుదలైన ఫస్ట్ షో కి మళ్ళీ ఐమాక్స్ కి వెళ్లి సినిమా చూసిన రాజమౌళి ఇంకా ఆ సినిమా ప్రమోషన్స్ మూడ్ లోనే ఉన్నాడు. విడుదలకు ముందు ప్రమోషన్స్ కన్నా.. మత్తువదలరా విడుదల తర్వాత రోజుకో ప్రెస్ మీట్ తో టీం మొత్తం మీడియా చెంతే ఉంటుంది. తాజాగా రాజమౌళి మత్తువదలరా హీరోలు సింహ, సత్య, అగస్త్య లతో మత్తువదలరా సినిమా గురించి ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేసాడు.
సత్య, సింహ, అగస్త్య ని మత్తువదలరా సినిమాకి సంబందించిన ఫణి ప్రశ్నలతో నవ్వించిన రాజమౌళిని నటుడు సత్య తిరిగి మీరు కొత్త హీరోలతో సినిమాలు చెయ్యరా అని అడగ్గా.. దానికి రాజమౌళి కథ డిమాండ్ చేస్తే కొత్త హీరోలను వదలని చెప్పడం ఇంకా సత్య.. మీరు మహాభారతంలో ఒక్క పార్ట్ అయినా తీస్తారని రూమర్ ఉంది అని అడగ్గానే... దానికి రాజమౌళి మహాభారత తీస్తే.. మొత్తం తీస్తా... అంతేకాని ఒక పార్ట్ తో వదిలెయ్యను అంటూ మహాభారతం సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. మరి రాజమౌళి ఆసక్తిని బట్టి మహాభారతం ఒక ఎపిసోడ్ కాదు.. పూర్తి సినిమాని తియ్యడం పక్కానే అన్నమాట.