Advertisementt

2020, ఫిబ్రవరి 7న ‘సవారి’

Wed 01st Jan 2020 01:45 AM
nandu,priyanka sharma,savaari movie,release,7 feb 2020  2020, ఫిబ్రవరి 7న ‘సవారి’
SAVAARI Movie Release Date Fixed 2020, ఫిబ్రవరి 7న ‘సవారి’
Advertisement
Ads by CJ

నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారి చిత్రం 2020, ఫిబ్రవరి 7న విడుదల..

నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే యానిమల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సవారి చిత్రం తెరకెక్కింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. నైజాంలో సవారి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. సవారీ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉంది. దాంతో పాటే ఉండిపోయా పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మీడియా ముందుకు వచ్చి విడుదల తేదీని ఖరారు చేసారు మేకర్స్. ఈ సినిమా 2020, ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

నటీనటులు: నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు..

టెక్నికల్ టీం:

దర్శకుడు: సాహిత్ మోత్కూరి

నిర్మాతలు: సంతోష్ మోత్కూరి నిశాంక్ రెడ్డి కుడితి

నైజాం విడుదల: ఏషియన్ సినిమాస్

సంగీతం: శేఖర్ చంద్ర

SAVAARI Movie Release Date Fixed:

Nandu and Priyanka Sharma starrer SAVAARI Movie Release on 7th Feb, 2020

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ