Advertisementt

ఇంట్రెస్టింగ్: ప్రభాస్ ‘జాన్’ కథ ఇలా ఉంటుందట!

Wed 01st Jan 2020 11:04 AM
interesting update,prabhas,john movie,pooja hegde  ఇంట్రెస్టింగ్: ప్రభాస్ ‘జాన్’ కథ ఇలా ఉంటుందట!
Interesting : Prabhas John Movie Story Details ఇంట్రెస్టింగ్: ప్రభాస్ ‘జాన్’ కథ ఇలా ఉంటుందట!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్’. అయితే ఈ సినిమా టైటిల్‌పై.. ఇంకా సస్పెన్స్ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకటి, అర అప్డేట్స్ అందాయి. అయితే సినిమా ఎలా ఉంటుంది..? ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది..? అని అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా.. టాలీవుడ్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

లవ్ అండ్ రొమాన్స్!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలుపుకార్లు రాగా.. తాజాగా అసలు సినిమా ఎలా ఉండబోతోందో క్లారిటీగా తెలిసిపోయింది. వాస్తవానికి ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ సీన్స్‌కు కొదవుండదని ఫ్యాన్స్ అనుకోవడం సహజమే. కానీ ఈ సినిమాలో మాత్రం అందరూ అనుకున్నంతగా యాక్షన్ సీన్స్ ఉండవట. కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే వుంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. కథ అనూహ్యమైన మలుపు తిరిగే సందర్భంలో మాత్రమేనని ఈ యాక్షన్ సీన్ ఉంటుందని.. హీరోయిన్‌ను ఫాదర్‌తో ఆ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కథ పూర్తిగా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

పిచ్చి పిచ్చిగా రొమాన్స్!

మరోవైపు.. ప్రభాస్-పూజా మధ్య రొమాన్స్ సీన్స్ కూడా గట్టిగానే ఉంటాయట. కథ లవ్ అండ్ ఎమోషనల్‌గా సాగితే మధ్య మధ్యలో రొమాన్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంటుందట. అంటే అటు లవ్ ఇటు రొమాన్స్ రెండింటికీ కొదువ ఉండదన్న మాట. కాగా.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బోలెడు పుకార్లు షికార్లు చేశాయి. మరి తాజా పుకారులో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడక తప్పదు.

Interesting : Prabhas John Movie Story Details:

Interesting : Prabhas John Movie Story Details  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ