నూతన సంవత్సరం సందర్భంగా మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని, ఠాగూర్ మధు కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. ఇది వరకు విడుదలైన టైటిల్ పోస్టర్‌లో రవితేజ మాస్ లుక్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
రవితేజ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్‌టెన్స్ లుక్, చేతిలో గోలీసోడాను పట్టుకున్న రవితేజ ‘క్రాక్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను నూతన సంవత్సరం సందర్భంగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో రవితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిలబడి ఉండటాన్ని చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. మెర్సల్, బిగిల్ చిత్రాల్లో విజువల్ బ్యూటీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులు:
రవితేజ, శృతిహాసన్, సుమద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాకర్, వంశీ చాగంటి తదితరులు
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి.మధు
బ్యానర్: సరస్వతి ఫిలింస్ డివిజన్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
కో ప్రొడ్యూసర్: అమ్మిరాజు కానుమిల్లి
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
పాటలు: రామజోగయ్యశాస్త్రి
మేకప్: శ్రీనివాసరాజు
కాస్ట్యూమ్స్: శ‌్వేత, నీరజ కోన
స్టిల్స్: సాయి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్: వర్కింగ్ టైటిల్ శివ
ప్రొడక్షన్ కంట్రోలర్: కోటపల్లి మురళీకృష్ణ
కో డైరెక్టర్స్: గులాబి శ్రీను, నిమ్మగడ్డ శ్రీకాంత్
చీఫ్ కో డైరెక్టర్: పీవీవీ సోమరాజు