నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగో విడుదల!!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్. బి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘22’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ‘22’ టైటిల్ యానిమేషన్ లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్ సింగ్, దేవి ప్రసాద్, జయప్రకాశ్, రవివర్మ, ఫిదా శరణ్య, పూజ రామచంద్రన్, రాజశ్రీ నాయర్, కృష్ణ చైతన్య, ఆఫ్గనిస్తాన్ రాజు, మాస్టర్ తరుణ్, బేబి ఓజల్, బేబి సంస్కృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్:పెద్దిరాజు అడ్డాల, యాక్షన్: స‌్టంట్ జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.