Advertisementt

వేటాడే పులి ‘గర్జన’తో వస్తోన్న లక్ష్మీరాయ్!

Sat 04th Jan 2020 12:38 AM
sriram,rai lakshmi,jaguar studios,b vinod jain,garjana,movie,shooting,details  వేటాడే పులి ‘గర్జన’తో వస్తోన్న లక్ష్మీరాయ్!
Jaguar Studios’ B Vinod Jain presents ‘Garjana’ starring Sriram and Rai Lakshmi వేటాడే పులి ‘గర్జన’తో వస్తోన్న లక్ష్మీరాయ్!
Advertisement
Ads by CJ

మనిషి, జంతువు... వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది. మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఈ అంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘గర్జన’. శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులి ఈ చిత్రం ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. టామ్ అండ్ జెర్రీ కథ మాదిరిగా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూడాల్సిందే. కథ, స్క్రీన్ప్ ప్లే, సినిమాటోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన పెద్దపులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత నరేష్ జైన్ తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు.

జె.పార్తిబన్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పార్తిబన్ పలు యాడ్ ఫిల్మ్ లు రూపొందించిన అనుభవముంది. అడయార్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పొలాచ్చి, తలకొన, మున్నార్, చెన్నై, ఊటీ, కొడైకెనాల్ తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తారు.

శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఇంకా దేవ్ గిల్, నైరా, వైష్ణవి చంద్రన్ మీనన్, ద్వైత, బ్లాక్ పాండి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఎడిటింగ్ - సుదర్శన్,  సంగీతం - అరుళ్ దేవ్, ఆర్ట్ - మిలన్ అండ్ ఎస్. రాజమోహన్, పీఆర్వో - సురేష్ కొండేటి, వీఎఫ్ ఎక్స్ - నాక్ స్టూడియోస్, డిజైన్స్, మోషన్ టీజర్ ఆర్ ఆర్ట్ స్టూడియో.

Jaguar Studios’ B Vinod Jain presents ‘Garjana’ starring Sriram and Rai Lakshmi:

Garjana Movie Shooting Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ