టాలీవుడ్‌లో ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తెలంగాణ నుంచి వచ్చిన హీరో.. పైగా బ్యాగ్రౌండ్ ఏమీలేకపోయినా.. కల్వకుంట్ల వారి ప్రోత్సాహంతో విజయ్ ఓ వెలుగు వెలుతున్నాడు. ఇటు సినిమాలు.. అటు ప్రకటనలు.. మధ్యలో బిజినెస్ ఇలా మూడు పూవులు ఆరు కాయలుగా విజయ్ పరిస్థితి సాగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం కుర్రాళ్లకు విజయ్ ఓ రోల్ మోడల్‌గా మారిపోయాడు. మున్ముందు ఈయన టాలీవుడ్‌లో నంబర్ వన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ మనసులోని మాటను బయటపెట్టారు.
కాగా.. ఇలా సాగిపోతుండగా విజయ్ ఎందుకో తన పేరు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ‘విజయ్ దేవరకొండ’ను కాస్త ‘దేవరకొండ విజయ్ సాయి’ గా మార్చుకున్నాడని టాక్ నడుస్తోంది. అంటే ‘సాయి’ అనే రెండు అక్షరాలు పేరుకు యాడ్ అయ్యాయన్న మాట. త్వరలో రిలీజ్ కానున్న తన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో విజయ్ దేవరకొండ అని కాకుండా ‘దేవరకొండ విజయ్ సాయి’ అని పేరు వేసుకుంటాడని సమాచారం.
ఇలా పేరు మార్చుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్‌తో ఆయన ఇలా చేసి ఉంటాడని సమాచారం. విజయ్‌కు బాగా కావాల్సిన వారు కొందరు ఈ సలహా ఇవ్వడంతో ఆయన.. పండితులను సంప్రదించగా ‘సాయి’ అని రెండక్షరాలు జతచేస్తే.. దశ తిరుగుతుందని చెప్పారట. అందుకే ఆయన పేరు మార్చుకున్నాడట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి.