టైటిల్ చూడగానే డైలాగ్ ఎక్కడో చూశామే అనిపిస్తోంది కదూ... అవును ఈ డైలాగ్ దర్శకుడు అనీల్ రావిపూడి నుంచి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోడిదే. ‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’ అంటూ మహేశ్ బాబు డైలాగ్ ఇరగదీశాడు. ఈ డైలాగ్ రిలీజ్ అయిన నాటి నుంచి సోషల్ మీడియాలో.. మహేశ్ ఫ్యాన్స్.. మరోవైపు కామెడీ స్కిట్‌లలో బాగానే తెగ వాడేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా.. మల్లెమాలకు సంబంధించిన ఓ కామెడీషో సంక్రాంతికి స్పెషల్ ఎపిసోడ్‌ను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమోలో జబర్దస్త్ కంటెస్టెంట్స్‌ల పిల్లలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా కుమారుడ్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ హడావుడితోనే ఈ స్పెషల్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రోజా స్టేజ్‌పైకి వచ్చి ‘ఎమ్మెల్యే కొడుకునే కిడ్నాప్ చేస్తాడా.. ఎంత ధైర్యం వాడికి’ అని హడావుడి చేస్తారు. మా వాడ్నే కిడ్నాప్ చేస్తావా.. చూడు వాడెంత కన్ఫూజన్‌లో ఉన్నాడో అని రోజా అనగా.. జబర్దస్త్ ఫేమ్ ఆది కలుగజేసుకుని.. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతారు.. మీరేమో యాక్టర్ కమ్ పొలిటిషియిన్ కమ్ జడ్జ్ కమ్ యాంకర్ వీటిలో ఏమవ్వాలో కన్ఫూజ్ అవుతున్నాడని చెబుతాడు.
ఆ తర్వాత మళ్లీ రోజా రేయ్..(కొడుకు) 10 లెక్క పెట్టేలోపు ఇక్కడికి వచ్చేయాలి అని లెక్కెట్టడం స్టార్ చేస్తారు.. ఆమె కుమారుడు మాత్రం అమ్మా బేరాల్లేవమ్మా అని బదులిస్తాడు. ఏంట్రా నోరెక్కువవుతోంది అని రోజా అనగా.. ‘అమ్మా మీరు ప్రతిపక్షం.. నేను అధికారపక్షం.. మీ పండుగ మీరు చేస్కోండి.. మా పండుగ నేను చేస్కుంటా’ అంటూ కుమారుడు డైలాగ్స్‌తో గట్టిగానే హడావుడి చేశాడు. కొడుకు డైలాగ్స్‌తో రోజా, స్టేజ్ పైనున్న కంటెస్టెంట్స్ సైతం కంగుతిన్నారు. మొత్తానికి చూస్తే తిన్నగా ఇలాంటి చిన్న చిన్న షోల నుంచే రోజా.. తన కుమారుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని దీన్ని బట్టి అర్థం చేస్కోవచ్చు.