నాగబాబు జబర్దస్త్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అదిరింది ప్రోగ్రాంని డిజైన్ చేయించాడు. అది కాస్త యాజిటీజ్ గా జబర్దస్త్ లానే ఉందనే కామెంట్స్ పడుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి బయటికి వచ్చి అదిరిందితో అదిరింది అనిపించుకుందామనుకున్న నాగబాబుకి అదిరింది పెద్దగా సక్సెస్ అవలేదనిపిస్తుంది. ఎందుకంటే మల్లెమాల అదిరింది టైం లోనే పాత జబర్దస్త్ స్కిట్స్ ని ప్రసారం చేయడంతో జబర్దస్త్ కి 4 నుండి 5 టీఆర్పీ రేటింగ్ వస్తుంటే.. అదిరిందికి అందులో సగం మాత్రమే వస్తున్నట్టుగా తెలుస్తుంది. జబర్దస్త్ లో చేసిన ఓల్డ్ బ్యాచ్ మొత్తం అదిరిందిలో ఏవో పీకుదామని నాగబాబు వెంట నడిచారు. నాగబాబు కూడా జబర్దస్త్ నుండి బయటికెళ్తూ జబర్దస్త్ ని పడెయ్యాలని కంకణం కట్టుకుని తనతో యాంకర్ దగ్గర్నుండి సుధీర్, ఆది లాంటోళ్ళు వచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేయించినా సుధీర్, ఆదిలు జబర్దస్త్ ని వదల్లేదు.
ఇకపోతే నాగబాకు అదిరింది ప్రోగ్రాం టైంకి మల్లెమాల కావాలని జబర్దస్త్ పాత స్కిట్స్ ని ప్లే చెయ్యడంతో.. ఇప్పుడు నాగబాబు కూడా అదిరింది టైంని మార్చే ప్లాన్ చేసాడు. మేము జబర్దస్త్ కి పోటీ రాకూడదనుకుని అదిరింది ఆదివారం నైట్ 9 గంటలకి పెట్టుకున్నాం. కానీ మల్లెమాల మమ్మల్ని వదలడం లేదు. నితిన్ - భరత్ లని తొక్కేయాలని చూస్తుంది అంటూనే అదిరింది ప్రోగ్రాంని జీ ఛానల్ ని ఒప్పించి గురు శుక్రవారాల్లో ప్రసారమయ్యేలా అదిరింది టైంని ఆదివారం నుండి గురు శుక్ర వారాలకు మార్పించేశాడని టాక్. తాను లేకపోతే జబర్దస్త్ కొలాప్స్ అవుతుంది అనుకుని కలలు కన్న నాగబాబుకి జబర్దస్త్ మూడు వారాలుగా షాకివ్వడంతో ఈసారి ఎలాగైనా జబర్దస్త్ ని పడెయ్యాలని గురు శుక్ర వారాల్లో అదిరింది పోగ్రామ్ ని దించుతున్నాడు. మరి ఇదెంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.