Advertisementt

‘ఎంత మంచివాడ‌వురా..’కు యు సర్టిఫికెట్

Mon 06th Jan 2020 05:53 PM
clean u certificate,entha manchivaadavuraa,kalyan ram,sathish vegesna,gopi sundar  ‘ఎంత మంచివాడ‌వురా..’కు యు సర్టిఫికెట్
Clean U certificate for entha manchi vadavura ‘ఎంత మంచివాడ‌వురా..’కు యు సర్టిఫికెట్
Advertisement
Ads by CJ

క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ... ‘ఈ సంక్రాంతి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మా ఎంత మంచివాడ‌వురా సినిమా ప్రేక్షకుల ముంందుకు వ‌స్తుంది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవ‌డ‌మే కాదు.. సింగిల్ క‌ట్ లేకుండా క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన ఎమోషన్స్‌తో సాగే కుటుంబ క‌థా చిత్రమిది’ అన్నారు. 

న‌టీన‌టులు :-

 నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :-

రచన, ద‌ర్శక‌త్వం: స‌తీశ్ వేగేశ్న

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్రఫీ:  రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌:

త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Clean U certificate for entha manchi vadavura:

Clean U certificate for entha manchi vadavura  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ