Advertisementt

ఐశ్వర్యం-సంపదకున్న తేడానే ‘అల వైకుంఠం’!!

Mon 06th Jan 2020 10:48 PM
ala vaikuntapuram lo movie,allu arjun,pooja hegde,trivikram  ఐశ్వర్యం-సంపదకున్న తేడానే ‘అల వైకుంఠం’!!
Here Alavaikuntapuram lo Movie Story..! ఐశ్వర్యం-సంపదకున్న తేడానే ‘అల వైకుంఠం’!!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ ఏదైనా పాత సినిమా చూసిన... లేదా ఏదైనా నోవెల్ నచ్చినా, లేదన్నా ఏదైనా ఫ్రెంచ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకుని హీరోలని ఇంప్రెస్స్ చేసి తన మేకింగ్ స్టయిల్ తో సినిమాలు తీస్తాడు. అయితే త్రివిక్రం మేకింగ్, ఆయన పంచ్ లకి వీరాభిమానులున్నట్లు... ఆయన కథ కాపీ చేశాడా.. లేదా తన క్రియేటివితో రాశాడా అనేది పక్కనబెట్టి మరీ త్రివిక్రమ్ సినిమాలు చూస్తారు. తాజాగా అల వైకుంఠపురములో సినిమా కథ విషయంపై త్రివిక్రమ్ తనదైన  స్టయిల్లో స్పందించాడు. నిన్నటివరకు గొప్పోడి కొడుకు ఒక డ్రైవర్ ఇంట్లో పెరగడం.. డ్రైవర్ కొడుకు గొప్పోడి ఇంట్లో పెరడం అనే కథ చుట్టూనే అల వైకుంఠపురములో కథ అని ప్రచారం జరిగింది.

ఇక త్రివిక్రమ్ కూడా చూచాయగా అల వైకుంఠపురములో కథ ఇదే అంటున్నాడు అదే ఐశ్వర్యానికి సంపదకు మధ్యన ఉన్న తేడానే ఈ సినిమా కథ అంటున్నాడు. ఐశ్వర్యం ఉన్నవారు అంటే మధ్యతరగతి ఇంటిలోని వారంతా ఆనందంగా ఉండడమే కాదు.. కాఫీ తాగుదామని వెళ్లినవారకి సరదాగా భోజనం పెట్టి పంపుతారని అదే ఐశ్వర్యం అని.. కానీ సంపద ఉన్న ఇంట్లో అంటే విశాలమైన భవంతిలోను కాసేపు ఉండలేమని బోర్ కొట్టేస్తుందని... విశాలమైన గదుల మధ్యన ఇరుకైన మనసులతో ఉంటారని అదే అంశంతో ఈ సినిమాని తెరకెక్కిందని చెబుతున్నాడు. మరి ఐశ్వర్యం, సంపద అంటూ మధ్యలో త్రివిక్రమ్ కామెడీ పంచ్ లతో అల్లు అర్జున్ మ్యానరిజం, స్టయిల్ తో అల వైకుంఠం మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేలా కనబడుతుంది.

Here Alavaikuntapuram lo Movie Story..!:

Here Alavaikuntapuram lo Movie Story..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ