Advertisementt

రెజీనా మెయిన్‌ రోల్‌లో మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ

Wed 08th Jan 2020 04:58 PM
mystery thriller,main role,regina  రెజీనా మెయిన్‌ రోల్‌లో మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ
Mystery Thriller Comes Main Role of Regina రెజీనా మెయిన్‌ రోల్‌లో మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ
Advertisement
Ads by CJ

న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా  తొలి చిత్రం ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్రత్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా తెర‌కెక్క‌నుంది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రెజీనా కసండ్ర ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఈ సినిమా రూపొంద‌నుంది. జ‌న‌వ‌రి 13 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, కామెడీ అంశాల‌తో ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా.. 

యాపిల్ ట్రీ స్టూడియోస్ అధినేత‌, నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు రాసిన క‌థ‌ను విన్న త‌ర్వాత నిర్మాత‌గా కంటే ప్రేక్ష‌కుడిగా చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కిన ఔట్ స్టాండింగ్, స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్న‌ స్టోరీతో  తెర‌కెక్క‌బోతున్న చిత్ర‌మిది. రీసెంట్ టైమ్‌లో రూపొందుతోన్న ద‌క్షిణాది చిత్రాల్లో హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు చాలా కొత్త‌గా, ఇన్నోవేటివ్‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో యాపిల్ ట్రీ స్టూడియోస్ సంస్థలో కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్  చిత్రంతో సినీ రంగంలో జ‌ర్నీని స్టార్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ఎవ‌రు’ చిత్రంలో రెజీనా క‌సండ్ర న‌ట‌న అందరినీ ఆక‌ట్టుకుంది. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ,  రెజీనా న‌టిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె గొప్ప ఎఫ‌ర్ట్ పెట్టి వ‌ర్క్ చేస్తున్నారు. ఆమె ఎఫ‌ర్ట్‌ను రేపు వెండితెర‌పై ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేస్తారు. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న తొలి చిత్రంలో, హీరోయిన్ రెజీనా అర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. డూప్ లేకుండా సినిమాలో యాక్షన్ స‌న్నివేశాల్లో ఆమె న‌టించాల‌నుకుంటున్నారు. అందుకోసం ఆమె ప్ర‌త్యేకంగా స్టంట్స్ శిక్ష‌ణ‌ను తీసుకుంటున్నారు. కొర్టాల‌మ్‌లో జ‌న‌వ‌రి 13 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ల‌వ్ లొకేష‌న్స్‌లోనే సినిమాను ఎక్కువ భాగం చిత్రీక‌రించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’ అన్నారు.

Mystery Thriller Comes Main Role of Regina:

Mystery Thriller Comes Main Role of Regina  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ