టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంత స్వార్థపరుడా అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే.. ఈ సంక్రాంతికి మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయ్. మరీ ముఖ్యంగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురములో..’, నందమూరి కల్యాణ్ హీరోగా ‘ఎంత మంచివాడవురా..’ రానున్నాయ్. అయితే ఈ మూడు సినిమాల కంటే ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ అంటూ ముందే వచ్చేశారు. బన్నీ, కల్యాణ్‌రామ్ సినిమాల కంటే ముందుగానే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
బన్నీ, కల్యాణ్ రామ్ నోట ఒకే మాట!
ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు ఎంతసేపూ తన చిత్రం గురించి చెప్పుకున్నాడే కానీ కనీసం తెలుగు చిత్రాల గురించి కానీ.. రజనీకాంత్ సినిమా గురించి కూడా చెప్పకపోవడం గమనార్హం. అయితే ఇదే ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టా్ర్ మాత్రం అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్.. బాగా ఆడాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. ‘సరిలేరు’ తర్వాత ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్‌లో బన్నీ గుర్తు చేసి మరీ అన్ని చిత్రాలూ బాగా ఆడాలని కోరుకున్నాడు. ఆ తర్వాత ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు బాగా ఆడాలని.. తన సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకున్నాడు. అంతేకాదు.. ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదేమాట అన్నాడు. అంటే మహేశ్ తప్ప మిగిలిన వారంతా అందరూ గుర్తు చేసుకుని మరీ చెప్పారన్న మాట.
మరిచారా.. అక్కర్లేదనుకున్నారా!?
బన్నీ, కల్యాణ్ రామ్ చాలా చక్కగా చెప్పారు కానీ.. మహేశ్ మాత్రం ఆ ఊసే ఎత్తలేదు ఎందుకు..? వాస్తవానికి సినిమాలో స్టఫ్ ఉంటే కచ్చితంగా ఆడతాయ్ అది వేరే విషయం.. కనీసం అన్ని సినిమాలు బాగా ఆడాలని ఒకే ఒక్క మాట అనుంటే రీల్‌లోనే కాదు.. రియల్‌లోనూ సూపర్‌స్టార్ అనిపించుకునే వారేమో..? మహేశ్‌కు ఇంత స్వార్థమా..? అని బన్నీ, నందమూరి ఫ్యాన్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరి మహేశ్ కావాలనే మిగతా సినిమాల గురించి చెప్పలేదా.. అక్కర్లేదనుకున్నారా? లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లాగే వాటి గురించి కూడా మరిచిపోయారా..? అనేది మహేశ్‌కే తెలియాలి.