Advertisementt

‘అదిరింది’ నుంచి నాగబాబు ఎగ్జిట్ అవుతాడా!?

Fri 10th Jan 2020 03:03 PM
nagababu,nagababu konidela,quit,adirindi comedy show  ‘అదిరింది’ నుంచి నాగబాబు ఎగ్జిట్ అవుతాడా!?
Will Nagababu going to quit Adirindi Comedy show!! ‘అదిరింది’ నుంచి నాగబాబు ఎగ్జిట్ అవుతాడా!?
Advertisement
Ads by CJ

‘జబర్దస్త్’లో ఏడేళ్లు నవ్వులు పూయించిన నాగబాబు.. మల్లెమాల మీద ఫైర్ అవుతూ ‘జబర్దస్త్’ నుండి ఎగ్జిట్ అయ్యి జీ ఛానల్‌లో అదిరింది ప్రోగ్రాంలో తేలాడు. ‘అదిరింది’ ప్రోగ్రాంలో నాగబాబు జడ్జ్‌గా.. చంద్ర, ఆర్పీ, వేణు, ధనరాజ్ లతో స్కిట్స్ చేయిస్తూ నవ్విస్తున్నాడు. అయితే ఎన్నో అంచనాల మధ్యన మొదలైన ‘అదిరింది’ షో కి మల్లెమాల అడుగడుగునా అడ్డం పడుతుంది. అదిరింది షో టైంలో ‘జబర్దస్త్’ హిట్ స్కిట్స్ ప్రసారం చేస్తూ నాగబాబుకి నిద్ర లేకుండా చేస్తుంది. జబర్దస్త్ పాత స్కిట్స్ ముందు అదిరింది షో తేలిపోతూ.. టీఆర్పీ రేటింగ్ లోను వెనుకబడిపోయింది. అయితే జబర్దస్త్ మీద కసి తీర్చుకోవాలనుకున్న కోరిక నాగబాబుకి తీరడం లేదు.

‘అదిరింది’ షో కి తక్కువ టీఆర్పీ రావడం.. జబర్దస్త్ ముందు అదిరింది చిన్నబోవడంతో... నాగబాబు అవమానంగా ఫీల్ అవుతున్నాడట. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎపిసోడ్స్ లోనుగా అదిరింది ప్రోగ్రాం టీఆర్పీ పెరగకుండా అదే కంటిన్యూ అవడంతో.. నాగబాబు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడట. జబర్దస్త్ లో ఎపిసోడ్ కి 10 లక్షల పారితోషకం వస్తే.. అదిరింది కి 25 లక్షలిచ్చారట జీ ఛానల్ వారు. అయితే పారితోషకానికి సరిపడా క్రేజ్ రాకపోవడంతో నాగబాబు ఇప్పుడు అదిరింది నుండి బయటికెళ్లడానికి ఆలోచన చేస్తున్నాడట. అయితే జబర్దస్త్ ముందు అదిరింది ప్రోగ్రాం లేపడానికి జబర్దస్త్ మీదే పంచ్ లు వేసిన నాగబాబు కి అదిరింది షో పెద్ద పంచ్ గా కనబడడం.. ఇక ప్రస్తుతం కొన్నాళ్ళు పాటు టివి షోస్ కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయానికి నాగబాబు వచ్చినట్లుగా టాక్. మరి నాగబాబు ని నమ్ముకుని వచ్చితిన్ కమెడియన్స్ పరిస్థితి ఏమిటో.. పాపం కదా..!

Will Nagababu going to quit Adirindi Comedy show!!:

Will Nagababu going to quit Adirindi Comedy show!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ