Advertisementt

అప్పుడు సరే.. ఇప్పుడేమంటావ్.. నయన్?

Fri 10th Jan 2020 06:57 PM
lady superstar nayanatara,nayan,murugadoss,darbar,gajini,tollywood  అప్పుడు సరే.. ఇప్పుడేమంటావ్.. నయన్?
News About Lady Superstar Nayanatara అప్పుడు సరే.. ఇప్పుడేమంటావ్.. నయన్?
Advertisement
Ads by CJ

నయనతార కెరీర్ కొత్తల్లో మురుగదాస్ తెరకెక్కించిన ‘గజినీ’ సినిమాలో ఓ స్టూడెంట్ పాత్ర చేసింది. అందులో ఆసిన్ మెయిన్ హీరోయిన్ కాగా.. నయనతార సెకండ్ హీరోయిన్. అయితే ‘గజినీ’ సినిమాలో తనకి తన పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి.. చివరికి తన పాత్ర ప్రాధాన్యతని తగ్గించినట్లుగా ఈమధ్యన నయనతార మురుగదాస్‌పై ఫైర్ అయ్యింది. దానికి కౌంటర్‌గా మురుగదాస్ కూడా.. పాత్రకి ప్రాధాన్యతను బట్టే నేను హీరోయిన్స్‌ని సెలెక్ట్ చేస్తా అని.. అంతేకాని.. ప్రాధాన్యత లేకుండా హీరోయిన్స్‌ని తీసుకోనంటూ ‘దర్బార్’ సినిమా షూటింగ్ అప్పుడు చెప్పాడు. మరి ‘గజినీ’ సినిమాలో సూర్య పక్కనే మంచి కేరెక్టర్ చేసిన నయనతార.. తన పాత్ర నచ్చలేదంటూ అప్పుడు ఫైర్ అయ్యి... ఇప్పుడు మాత్రం చేసిందేమిటి..? అని నయన్‌పై నెటిజెన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నయనతార, మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో రజినీకాంత్‌కి జోడిగా నయనతార నటిస్తుంటే.. సినిమాపై ఎక్కడలేని అంచనాలు వచ్చేసాయి. ఎందుకంటే రజినీకాంత్ హీరోస్ లో నెంబర్ వన్ అయితే.. హీరోయిన్స్ లిస్ట్ లో నయనతారే నెంబర్ వన్. కాబట్టి నయనతార పాత్రపై ‘దర్బార్’ విషయంలో గట్టి అంచనాలు వచ్చేసాయి. తీరా సినిమా చూసాక ఈమాత్రం దానికా నయన్, మురుగదాస్ మీద అప్పట్లో అంతలా ఫైర్ అయ్యింది అంటున్నారు. అంటే దర్బార్ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర చేసింది నయనతార. జస్ట్ హీరోయిన్ ట్రాక్ ఉండాలి అంటే ఉండాలిగా అన్నట్టుగా మురుగదాస్ ఓ ట్రాక్ పెట్టి.... అందులో నయనతారని తీసుకున్నాడు. తీరా నయనతార లుక్స్, గ్లామర్ పరంగా బావున్నప్పటికీ.. ఆమె పాత్రకీ అంతగా స్కోప్ లేదు. నయనతార రజినీకాంత్ పక్కన అలంకారంగా మాత్రం ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న నయనతార తన స్థాయికి తగ్గ పాత్ర చేయలేదిందులో అనిపిస్తుంది. మరి కేవలం రజినీకాంత్ హీరో అన్నందుకే నయనతార ఈ సినిమా ఒప్పుకుందేమో అని అనిపించక మానదు. మరి గజినీ విషయంలో అంతగా గొడవ చేసిన నయనతార ఇప్పుడు ఏమంటుందో చూద్దాం..!

News About Lady Superstar Nayanatara:

News About Lady Superstar Nayanatara  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ