Advertisementt

‘అల వైకుంఠ‌పుర‌ములో’.. ప్రీమియర్ షో టాక్ ఇదే!

Sun 12th Jan 2020 08:40 PM
allu arjun,trivikram srinivas,ala vaikunthapurramuloo,movie,1st report  ‘అల వైకుంఠ‌పుర‌ములో’.. ప్రీమియర్ షో టాక్ ఇదే!
Ala Vaikunthapurramuloo Movie Premiere Talk out ‘అల వైకుంఠ‌పుర‌ములో’.. ప్రీమియర్ షో టాక్ ఇదే!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ డైలాగ్స్, అల్లు అర్జున్ కామెడీ, మ్యానరిజంతో ఈ సినిమాపై భారీ హైప్ వచ్చేసింది. సాంగ్స్ తోనూ, టీజర్, ట్రైలర్ తోనూ అల్లాడించిన త్రివిక్రమ్ మరియు బన్నీల అల వైకుంఠపురములో సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.  ప్రీమియర్స్ షో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ కామెడీ అదుర్స్ అని.. జులాయి తర్వాత అల్లు అర్జున్ ఆ రేంజ్ కామెడీ అలవైకుంఠపురములో సినిమాలో చేసాడని అంటున్నారు. మ్యూజికల్ గా ముందే బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ చిత్రం వాటిని విజువల్ గా చూపించే క్రమంలో కూడా వండర్ చేసిందని... ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

ఇక త్రివిక్రమ్ కామెడీతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతే.. సెకండ్ హాఫ్‌ విషయంలో మాత్రం త్రివిక్రమ్ కాస్త తడబడ్డాడట. సెకండ్ హాఫ్ లో వావ్‌ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం నిరాశకలిగిస్తుందన్న అంశంగా చెబుతున్నారు. మెగాస్టార్ మరియు ఇతర స్టార్ హీరోల సాంగ్స్ కు బన్నీ స్టెప్పులు వేసే ఎపిసోడ్ చూడాలి. ఇది మాత్రం అందరి హీరోల ఫ్యాన్స్ కు పండగే. అయితే కథను పక్కన పెట్టి త్రివిక్రమ్‌ రాసుకున్న సబ్‌ ప్లాట్‌ ఏమంత వర్క్‌ కాలేదంటున్నారు ప్రేక్షకులు. ఇక బన్నీ డాన్స్, మ్యానరిజం కామెడీ అన్ని సినిమాకి హైలెట్ గా ఉన్నాయని, మ్యూజిక్ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది అని... ఫ్యామిలీ ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యిందని.. కాకపోతే పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఇద్దరూ కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే పరిమితమయ్యారని అంటున్నారు. కథలో కొత్తదనం లేకపోవడం కూడా సినిమా మైనస్ పాయింట్స్ లో ఒకటిగా ఉందనేది ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల స్పందన.

Ala Vaikunthapurramuloo Movie Premiere Talk out:

Ala Vaikunthapurramuloo Movie 1st Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ