మెహ్రీన్ కౌర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించినా అమ్మడుకు మాత్రం స్టార్ హీరోల అవకాశాలు కాదు కదా.. యంగ్ హీరో అవకాశాలు కూడా అంతంత మాత్రమే. గత ఏడాది ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెహ్రీన్ కౌర్ ఈ ఏడాది మాత్రం ఈ సంక్రాంతికి మాస్ హీరో కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా అనడమే కాదండోయ్.. తమిళనాట స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించిన పటాస్ తోనూ ఈ సంక్రాంతికి సందడి చేయబోతుంది. అలాగే జనవరి 31 న నాగశౌర్యతో కలిసి అశ్వద్దామా చిత్రంలోనూ మెహ్రీన్ హడావిడి ఉంది. మరి గత ఏడాది ఎఫ్ 2 లో హానీగా ప్రత్యేక మ్యానరిజంతో ఆకట్టుకున్న మెహ్రీన్ ఈ ఏడాది ఎంతమంచివాడవురాలో ఎలా ఆకట్టుకుంటో చూడాలి.
అలాగే అదే రోజు విడుదల కాబోతున్న ధనుష్ పటాస్ తో తమిళంలోనూ హిట్ కొట్టాలని తహతహలాడుతోంది. ఇక ఎంత మంచివాడవురా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే.. పటాస్ మాత్రం మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఎంతమంచివాడవురా మీద హైప్ ఎలా ఉన్నప్పటికీ... తమిళనాట మాత్రం పటాస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఒకేసారి రెండూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మెహ్రీన్ కి రెండిటిలో ఏది హిట్ అయినా సంక్రాంతి పండగని భారీగా సెలబ్రేట్ చేసుకుంటుంది.