రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ పక్కన నటిస్తున్నా అని తెలిసినప్పటి నుండి తెగ ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ హీరో సినిమా.. అందులోను భారీ బడ్జెట్ సినిమా అని. ఇక సినిమా ప్రమోషన్స్ లోను రష్మిక ఎగ్జైట్మెంట్ కళ్లారా చూసాం. మహేష్ పక్కన డాన్స్ చెయ్యడం భయమని, మహేష్ అబ్బో సూపరని, విజయశాంతి మేడం నుండి ఎన్నో నేర్చుకున్నా అని ఇలా సరిలేరు నీకెవ్వరు గురించి అడుగడుగునా ఎగ్జైట్ అవుతూనే ఉంది. అయితే రష్మిక ఎగ్జైట్ అయినంతగా సరిలేరు నీకెవ్వరులో ఆమె కేరెక్టర్ పండలేదు. సంస్కృతి పాత్రలో రష్మిక అల్లరిగా బాగానే కనబడినప్పటికీ.. మహేష్ ముందు మరీ చిన్నపిల్లలా తేలిపోయింది.
ఇక అర్ధమవుతుందా అనే మ్యానరిజంలో తప్ప రష్మిక కామెడీ అంతగా అనిపించదు. అసలు రష్మిక పాత్ర డిజైనింగ్ నే సరిగ్గా లేదు. సినిమాలో ఇలా వచ్చి, అలా మాయమై, మళ్లీ అలా వచ్చి, మెరుపులా మెరుస్తుంది. ఆమె పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఆమె ఉత్సాహంగానే నటించినా.. పాత్ర మరీ సిల్లీగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా మహేష్ ముందు ఆమె తేలిపోయింది. సాంగ్స్ లో కాస్త కాస్ట్యూమ్స్ తో మ్యానేజ్ చేసిన రష్మిక.. మిగతా విషయాల్లో మహేష్ ముందు అస్సలు ఆనలేదు. మరి రష్మిక మొదటి నుండి ఎగ్జైట్ అయినంతగా సినిమాలో ఏం లేదు. మరి అనిల్ రావిపూడి స్టార్ హీరోయిన్ ని ఎందుకు తీసుకోలేదో రష్మిక పాత్ర చూస్తే తెలుస్తుంది.