Advertisementt

‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ

Mon 13th Jan 2020 12:32 AM
cheema prema madhyalo bhama movie,cheema prema madhyalo bhama movie release date,srikanth sri appalaraju  ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ
Cheema Prema Madhyalo Bhama Movie Release Date Fixed ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ
Advertisement
Ads by CJ
  • * జనవరి 24న ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదలకు రెడీ 
  • * సంక్రాంతి తరువాత ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ సందడి షురూ 
  • * నందమూరి బాలకృష్ణగారి అభిమానులకు ఓ నజరానా

మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘చెప్పకూడని రహస్యం - హీరో నందమూరి బాలకృష్ణగారి అభిమానులు మా సినిమా చూస్తే, థియేటర్లో చప్పట్లు, ఈలలు గ్యారంటీ! ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఈ జనవరి 24న తెలుస్తుంది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. 

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సినిమా ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ను దర్శకుడు విలక్షణమైన శైలిలో తెరకెక్కించారు. పసందైన పాటలతో, అద్భుతమైన కథనంతో సాగుతూ పెద్ద సినిమాలకు ధీటుగా అందరినీ అలరిస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి యు బై ఏ సర్టిఫికెట్‌తో పాటు మంచి ప్రశంసలు అందాయి. జనవరి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

హీరోయిన్ ఇందు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్ - ఎందుకంటే ఇది నా తొలి సినిమా! యువ ప్రేమికుల భావావేశాలతో సాగే సృజనాత్మకమైన కథ అందంగా ఉండి అందరికీ కనెక్ట్ అవుతుంది. చీమ హీరో కావడం ఇంకా స్పెషల్! తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. 

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి; సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు.

Cheema Prema Madhyalo Bhama Movie Release Date Fixed:

Cheema Prema Madhyalo Bhama Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ