అవును మీరు వింటున్నది నిజమే.. నందమూరి బాలకృష్ణ-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా ఉండొచ్చని సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల సినిమా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కొరటాలే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. అవునా ఎప్పుడు చెప్పారు..? అయినా ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాతో బిజిబిజీగా ఉన్నారు కదా..? అనే అనుమానాలు వస్తున్నాయ్ కదూ.. క్లారిటీ కావాలంటే ఇక ఆలస్యమెందుకు ఈ ఆర్టికల్ చకచకా చదివేయండి.
కొరటాల సీక్రెట్ రివీల్!
‘జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అంటూ 2016లో రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్.. పాడైన వాహనాలతో పాటు అన్యాయం చేసే వ్యక్తుల్ని సైతం రిపేర్ చేసి దారిలో పెట్టి.. సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని వెళ్లిపోయాడు. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్, మోహన్ లాల్ గురించి పెద్ద చర్చే జరిగింది. అంతేకాదు.. మొదట మోహన్ లాల్ పాత్రను నందమూరి బాలయ్యకు అనుకున్నారని కూడా టాక్ నడిచింది. అయితే ఇందులో నిజమెంత అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇటీవల కొరటాల రివీల్ చేశాడు.
నందమూరి అభిమానుల్లో ఆశలు!!
‘జనతా గ్యారేజ్‌లో బాలకృష్ణని తీసుకోలేదేంట’ అని కొరటాలను ఓ వీరాభిమాని అడగ్గా.. ఆయన చాలా లాజిక్‌గా బదులిచ్చాడు. ఎన్టీఆర్-బాలయ్య సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవని.. ఈ కాంబోలో సినిమా వస్తే వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది..? సీన్స్ ఎలా ఉన్నాయ్..? అనేది చూస్తారే తప్ప కథను మాత్రం ఎవరూ పట్టించుకోరని చెప్పుకొచ్చాడు. అందుకే.. బాలయ్య సెట్ అవ్వరని తీసుకోలేదని క్లారిటీ ఇచ్చుకున్నాడు. అంతటితో ఆగని ఆయన.. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావొచ్చని చెప్పాడు. వాస్తవానికి ఈ కాంబోలో సినిమా కోసం సినీ ప్రియులు, నందమూరి వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కొరటాల వ్యాఖ్యలతో మరోసారి నందమూరి అభిమానుల్లో ఆశలు పుట్టాయ్. కొరటాల మనసులో నుంచి ఈ మాట వచ్చిందా..? లేకుంటే ఏదో అలా రాయేశాడా..? సినిమా వస్తే శివ తెరకెక్కిస్తాడా..? లేకుంటే మరొకరెవరైనా రెడీగా ఉన్నారని ఆయన పరోక్షంగా చెప్పాడా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.