Advertisementt

RRR: షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారుగా!

Sat 18th Jan 2020 12:34 PM
rrr,climax fight,shocking budget,rajamouli,jr ntr,ram charan  RRR: షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారుగా!
Shocking Budget to RRR Movie Climax Fight RRR: షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారుగా!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ముచ్చట్లేమీ ఈ సంక్రాంతికి కూడా బయటికి రాలేదు కానీ.. సినిమా విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర ఫ్యాన్స్ కూడా పిచ్చ క్యూరియాసిటీతో ఉన్నారు. రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో అల్లాటప్పా సినిమా ఏమి చెయ్యడం లేదని... RRR ఒక్కో ఎపిసోడ్స్ విషయంలో బయటికొస్తున్న ఫిగర్స్‌ని బట్టి అర్ధమవుతుంది. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అదుర్స్.. దానికి ఇంతని, ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ఇంత అనే వార్తలతో పాటు బాలీవుడ్ నటుల పారితోషకాల విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు.

ఇక తాజాగా RRR విషయంలో రాజమౌళి స్కెచ్ చూస్తుంటే అందరికి షాక్ తగిలేలా ఉంది. RRR పాన్ ఇండియా మూవీగా మలుస్తున్న రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌ని మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి RRR క్లైమాక్స్‌ని భారీ బడ్జెట్‌తో కళ్ళు చెదిరే విజువల్స్‌తో చూపించబోతున్నాడట. RRR క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం దాదాపు 150 కోట్లు ఖర్చు చేశారని RRR చిత్ర బృందం ఫీలర్లు వదులుతుంది. ఇప్పటికే సినిమా మీద భారీ హైప్ ఉంటే.. ఇప్పుడు ఇలాంటి న్యూస్‌లు ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. అసలు రాజమౌళి తన సినిమాపై ప్రత్యేకమైన అంచనాలు పెంచక్కర్లేదు.. ఆటోమాటిక్‌గా అంచనాలు ఆకాశంలోనే ఉంటాయి. 

Shocking Budget to RRR Movie Climax Fight:

RRR Movie Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ