Advertisementt

అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది?

Wed 22nd Jan 2020 12:17 PM
pawan kalyan,politics,janasena,pink remake,strategy,lawyer saab  అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది?
Pawan Kalyan Busy with Politics and Movies అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్న టైం లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజధానుల విషయంలో ఏపీ మొత్తం అట్టుడుకుతుంది అన్న టైప్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి టైం లోనే బిజెపిని మంచి చేసుకోవడం, మధ్యలో సినిమాలు అంటూ పింక్ రీమేక్ షూట్‌కి హాజరవడంతో జనసేన పార్టీ వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంలో పవన్ ఫాన్స్ సంతృప్తిగాను లేరు. అయినా పవన్ తన పని తాను చేసుకుపోతున్నాడు. నిన్న జనవరి 20 నుండి పింక్ రీమేక్ షూట్ లో పవన్ పాల్గొంటున్నాడు.

తాజాగా పవన్ లాయర్ సాబ్ లుక్ ఒకటి లొకేషన్ నుండి బయటికొచ్చి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలకు దూరం కాకుండా ఓ గంట లేదో మరో గంట పింక్ రీమేక్ షూట్ కోసం సమయం కేటాయించి.. తర్వాత రాజకీయాల్లోకి జంప్ అవుతున్నాడు. నిన్నటికినిన్న ప్రొద్దుటే షూటింగ్, సాయంత్రం రాజధాని విషయంలో ప్రెస్ మీట్. 

ఇలా పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయంతో ఫుల్ బిజీ. మరి పింక్ రీమేక్ కూడా పవన్ కళ్యాణ్ అందుకే ఒప్పుకున్నాడేమో.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ అన్నంత పెరఫార్మెన్స్ ఈ సినిమాలో చెయ్యర్లేదు. అలాగే తనకి ఎక్కువ పని వుండదు కనుకే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒపుకున్నాడనిపిస్తుంది. మరి దిల్ రాజు చేతిలో పడిన వారెవరైనా ఏకబిగిన షూటింగ్ చేసి సినిమా పూర్తి చెయ్యాలి. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా గనక దిల్ రాజు కూడా కామ్ అవ్వాల్సిన పరిస్థితి.

Pawan Kalyan Busy with Politics and Movies:

What Is the Pawan Kalyan Strategy?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ